స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన ప్రమాదం

By Krishna Babu Nov. 21, 2020, 03:00 pm IST
స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన ప్రమాదం
ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకునట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్దకు స్పీకర్ ప్రయాణీస్తున్న కాన్వాయి రావడంతో ఒక్కసారిగా కాన్వాయి మధ్యలోకి ఓ ఆటో వేగంగా దూసుకుని రావడంతో ఈ ప్రమాధం చోటు చేసుకుందని, స్పీకర్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ ఆ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో తమ్మినేనికి పెను ప్రమాదం తప్పిందని. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా తిరిగి వెళ్ళినట్టు తెలుస్తుంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp