పొరుగు రాష్ట్రాలకి ఆదర్శంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ.

By iDream Post Mar. 30, 2020, 01:06 pm IST
పొరుగు రాష్ట్రాలకి ఆదర్శంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ.

 రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్త సత్ఫలితాలని ఇస్తు దేశం చూపు తమ వైపు తిప్పుకుంటుంది. తెలుగుదేశం అధినేత నుండి ఇతర పార్టి ముఖ్య నాయకుల వరకూ ఎంత అవహేళగ మాట్లాడినా సరైన సమయంలో వీరి సేవల వలన రాష్ట్రానికి ఎనలేని మేలు జరిగింది. గోనె సంచులు మోసే ఉద్యోగం, వాలంటీర్లకు పిల్లను ఇవ్వరు, మగవారు లేని సమయంలో తలుపులు కొట్టి ఆడవారికి ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటు ప్రతిపక్ష నాయకుడే స్వయంగా విమర్శలు చేసినా, నేడు వీరి సేవలే రాష్ట్రానికి అక్కరికి వచ్చాయి అనడంలో సందేహం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ కరాళ నృత్యం చేస్తు వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలని హరిస్తుంది, భారత్ లో కూడా కరొనా వైరస్ మరణ మృదంగం వాయిస్తుంది. ఇప్పటికే కరోనా సోకిన వారి సంఖ్య వేయి దాటింది. పక్కన ఉన్న పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా కేసుల సంఖ్య 70కి చెరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అన్ని రాష్ట్రాల కన్న నమోదౌతున్న కేసులు చాలా స్వల్పంగా ఉంటున్నాయి. దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏర్పాటు చెసిన వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పవచ్చు. రాష్ట్రం లాక్ డౌన్ ప్రకటించిన మరుక్షణం నుండి రంగంలోకి దిగిన వాలంటీర్లు గ్రామాల్లో ఈ వైరస్ పట్ల అవగాహన కల్పిస్తు, వారికి ఇచ్చిన స్మార్ట్ ఫోనుల్లో ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తు తద్వారా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇంటి ఇంటికి తిరుగుతు ఇతరదేశాలనుండి కానీ ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన వారికి దగ్గరుండి వైద్య పరిక్షలు చేయిస్తు హోం ఐసోలేషన్ లోనే ఉండాలని సూచిస్తున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్త ప్రస్తుతం రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మారింది.

కరొనా వైరస్ కట్టడి పట్ల వాలంటీర్ల వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, తద్వారా అందుతున్న సత్ఫలితాలను గమనించిన కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కూడా గ్రామ స్థాయిలో కరోనా నిర్మూలనకు చర్యలు చేపట్టేలా వాలంటీర్ల వ్యవస్థను రూపోందించబోతునట్టు ప్రకటించింది. ఇప్పటికే కరోనా మహమ్మారి కేరళ రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపించడంతో గ్రామ స్థాయిలో సేవకులుగా 2 లక్షల 36వేల్ల మంది వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. కేరళ సి.యం ఆదేశాల మేరకు వాలంటీర్ల నియమాకాలు చేపట్టేందుకు ప్రభుత్వ అధికారలు రంగం సిద్దం చేశారు. బ్రిటన్ దేశంలో కూడా ఇప్పటికే కరొనా కట్తడికి 2 లక్షల 80వేల వాలంటీర్ల పోస్టులకి రంగం సిద్దం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకుల చేతుల్లో వారి కార్యకర్తల చేతుల్లో ఎంతో హేళనకు గురైన వారలంటీర్లు ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా చెప్పవచ్చు. రాష్టానికి వాలంటిర్ల వ్యవస్థ గుదిబండగా మారుతుందనే విమర్శలను తిప్పి కొడుతు వాలంటిర్ల వ్యవస్తే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విధంగా వారు అందిస్తున్న సేవలు నిజంగా ఎంతో ప్రశంసనీయం. రాష్ట్రంలో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 లక్షల పైగా నిరుద్యోగులకి వాలంటీర్ల వ్యవ్స్తను రూపొందించి ఉద్యోగాలు కల్పించారు. వారి చేత రేషన్ దగ్గరనుంది పించన్ వరకు అన్ని సేవలు ఇళ్ల దగ్గరకే చేరవేస్తున్నారు. ఇప్పుడు అదే వ్యవస్త ద్వారా కరొనా లాంటి మహమ్మరిని రాష్ట్రంలో పాకకుండా చేసి పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. మొన్నటి నాడు దిశా చట్టంతో పక్క రాష్ట్రాలకు దిక్సూచి గా మారితే నేడు వాలంటీర్ల వ్యవస్థతో మరోసారి మార్గం చూపించినవారయ్యరు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp