బాబుగారూ... పండగ చేసుకున్నారా !! మీకు తప్ప ఊరంతా సంక్రాంతే

By Nehru.T Jan. 15, 2021, 06:28 pm IST
బాబుగారూ... పండగ చేసుకున్నారా !! మీకు తప్ప ఊరంతా సంక్రాంతే

అధికారం కోల్పోయినప్పటి నుంచి ఉక్రోషంతో, కడుపుమంటతో, అసూయతో రగిలిపోతున్న చంద్రబాబు ఈ ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరని, అందుకు ఈ సంక్రాంతి పెద్దపండగ చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులను మోసం చేశారంటూ పలు జీవోలను భోగి మంటలో వేసి దహనం చేసి తన తాపాన్ని తీర్చుకున్నారు. ఆయన చెప్పింది నిజమే.. ప్రజలు కొన్ని సందర్భాల్లో పండగ చేసుకోరు. ఎప్పుడంటే తమ కుటుంబీకులు ఎవరైనా పండగ దగ్గర్లో కన్నుమూసినపుడు, లేదా ఆ ఏడాదంతా అత్యంత విషాధంలో మునిగి ఉన్నపుడు ప్రజలు ఆ బాధలు హటాత్తుగా మరచిపోయి జరగదు. ఆ సంప్రదాయం చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది. ఆయన పదవీచ్యుతుడవడం, తన ఆంతరంగికులు కోర్టు కేసుల్లో చిక్కుకోవడం, తనకు మద్దతుగా నిలిచే పలువురు పెద్దలు బదిలీల పై వెళ్లడం, మిగిలిన వాళ్లు పార్టీని వీడడం ఇటు కొడుకు లోకేష్ ఇంకా రాజకీయంగా ఎదగకపోవడం, అటు ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరిగిపోవడం ఇవన్నీ చంద్రబాబు పాలిట అపశకునాలే. అందుకే ఆయన చేసుకోలేదు.

మరి ప్రజల భావన ఎలా ఉందీ??

ప్రతి గ్రామంలోనూ వారం కిందటే ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. లక్షలాదిమంది కొత్తగా జాగాలు తీసుకున్నారు. వచ్చే ఏడాదికల్లా కొత్త ఇళ్లు త్వరగా పూర్తి చేసుకుని కొత్త ఇంట్లోకి వెళదామన్న సంతోషంతో ఉన్నారు. బిడ్డలున్న తల్లులకు భోగీ ముందురోజే అమ్మ ఒడి డబ్బులు రూ.14000 బ్యాంకు ఏకవుంట్లలో జమయ్యాయి. ఆ సంతోషం ఇంకా వారి కళ్లముందే ఉంది. చక్కగా పిల్లలను చదివించుకోవచ్చన్న భరోసా ఏర్పడింది. భరోసా అంటే గుర్తొచ్చింది లక్షలాది మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అందాయి. ఇంకా డ్వాక్రా మహిళలకు జగనన్న చేయూత డబ్బులు జమయ్యాయి. వారిలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆ డబ్బుతో ఏదైనా చిరు వ్యాపారం చేసి మరింత వృద్ధిలోకి రావాలన్న ఆనందం, పట్టుదల వారిలో నెలకొంది. స్కూల్ పిల్లలందరికీ జగనన్న విద్యాకానుక అందింది. అందరూ యూనీఫామ్, కొత్త బూట్లు, బ్యాగు, పుస్తకాలు, నోటుపుస్తకాలను తీసుకుని ఉత్సాహంగా బడికి పోయేందుకు సిద్ధమయ్యారు. పోన్లే ఈ విద్యాసంవత్సరం కరోనా వల్ల దెబ్బతిన్నది. ఈ సారి మాత్రం కొత్త పుస్తకాలు, బ్యాగు వేసుకుని అనందంగా బడికిపోదామని పిల్లలు కుతూహలంగా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పాఠశాలల రూపురేఖలు మార్చిన నాడునేడు పథకం చూసి పిల్లలు, తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. అయ్యో.. మేం ఉన్నపుడు ఇలాంటి అవకాశం లేకపోయిందే. విరిగిన బెంచీలు, వర్షానికి నీళ్లుకారే పెంకుల షెడ్లు, ఇవేకదా మా స్కూల్లో ఉండేవి ..ఇప్పుడు ఇంత అధునాతనంగా తయారయిందా అని ఆరేడేళ్ల కిందట అదే స్కూల్లో నుంచి బయటకు వెళ్లిన పిల్లలు ఇప్పుడు మళ్లీ అదే స్కూలును చూసి అబ్బుర పడుతున్నారు. పెరిగిన పెన్షన్ల డబ్బులతో పండగ సంబరంగా చేసుకున్నాం మనవడా.. అని మురిసిపోయే మామ్మలెందరో..

ఇలా ఏ వర్గమూ ఇబ్బందుల్లో లేకుండా అంతా.. సంతోషంగా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. అపును షుగర్ ఉన్నవాళ్లు మిఠాయిలు తినలేక మానేస్తున్నారు కదాని ఊళ్లోని వారంతా వాటిని పారబోయరు. కదా... చంద్రబాబుకు ఉడుకుమోత్తనంగా ఉంది కదాని ప్రజలంతా పండగ చేసుకోవడం మానేస్తారా ఏమిటీ...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp