మరో జీవోను రద్దు చేసిన హైకోర్టు

By Kotireddy Palukuri May. 22, 2020, 01:14 pm IST
మరో జీవోను రద్దు చేసిన హైకోర్టు

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ఏపీ సర్కార్‌ ఇచ్చిన జీవోను ఇటీవల రద్దు చేసిన రాష్ట్ర హైకోర్టు తాజాగా మరో జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం, ఆయా రంగులకు అర్థాలు వివరిస్తూ జగన్‌ సర్కార్‌ జారీ చేసిన జీవో నంబర్‌ 623ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు రద్దు చేసింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రెండు రోజుల క్రితం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. దాన్ని ఈ రోజు వెలువరించింది.

రంగులు తొలగించాలని హైకోర్టు, సుప్రిం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రంగులు వేయడంపై జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ పంచాయతీరాజ్‌ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. ఈ నెల 28వ తేదీలోపు రంగులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని లేదంటే.. కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది. కాగా, మూడు రంగులతోపాటు.. కొత్తగా మట్టి రంగు వేయాలని ప్రభుత్వం జీవో నంబర్‌ 623ను జారీ చేసిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp