లాక్ డౌన్ - నీడ లేని వారి పట్ల సీఎం ఔదార్యం

By iDream Post Mar. 27, 2020, 06:35 pm IST
లాక్ డౌన్  - నీడ  లేని వారి పట్ల సీఎం ఔదార్యం

 కరోనా ప్రభావంతో సర్వం స్తంభించిన వేళ , ఇతర ప్రాంతాల నుండి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొనే వారు , గుళ్లు , బస్టాండ్ , రైల్వే స్టేషన్లు ఆశ్రయించి ఉండేవారు , ఒక్కసారిగా నిరాశ్రయులు అవ్వటమే కాకుండా , వీరికి ఆహారం కూడా దొరకని పరిస్థితి .

ఇలాంటి స్థితిలో వీరు లాక్ డౌన్ పాటించే పరిస్థితి పక్కన పెడితే , ఆహారం , వసతి కోసం అల్లడాల్సిన దుస్థితి . ఇది గమనించిన కొన్ని ప్రాంతాల్లోని ఉదారవాదులు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో వారికి భోజనాన్ని ఏర్పాటు చేశారు . అది కూడా సోషల్ డిస్టన్స్ పాటించాల్సిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పార్సిల్ రూపంలో అందించారు .
ఈ ఘటనలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం నిరాశ్రయులుగా ఉన్నవారిని గుర్తించి వారి సంఖ్యకు తగ్గట్టు సోషల్ డిస్టెన్స్ కు అనుగుణంగా కళ్యాణ మండపాల్లో వసతి సౌకర్యం కల్పించమని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ప్రెస్మీట్ లో మినిష్టర్ పేర్ని నాని వెల్లడించారు .

అంతే కాక ఆయా ప్రాంతాల్లోని పెద్దలు , దాతలు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో వారి వెసులుబాటుని బట్టి ఈ నిరాశ్రయులకు భోజన వసతి కల్పించవచ్చని అలా ఎవరూ రాని చోట ప్రభుత్వమే వారికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తుందని నానీ తెలిపారు .

సమాజం మొత్తం స్తంభించిన వేల సామాన్యులు ఏ అంశాల్లో ఇబ్బంది పడతారో కూలంకషంగా పరిశీలించి తగు చర్యలు తీసుకొంటున్న ఏపీ ప్రభుత్వం ఇలా చిట్ట చివరి వరసలో కనపడే నిరాశ్రయులను కూడా గమనించి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది .

ప్రచారార్భాటం లేకుండా , ప్రెస్మీట్ మాటల కన్నా తన పనితీరుతోనే ప్రజల మన్ననలు పొందుతున్న జగన్ తీసుకున్న ఈ చర్య లాక్ డౌన్ రోజుల్లో సామాన్యులకు చాలా మేలు చేస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp