స‌ర్వేలో వివ‌రాలు ఇవ్వ‌క‌పోతే...ప‌థ‌కాలు క‌ట్‌

By Sodum Ramana 18-11-2019 06:41 PM
స‌ర్వేలో వివ‌రాలు ఇవ్వ‌క‌పోతే...ప‌థ‌కాలు క‌ట్‌
వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ల‌బ్ధిదారుల‌కు వేగంగా అందించేందుకు వైఎస్సార్ న‌వ‌శ‌కం పేరుతో నాలుగు కొత్త‌కార్డులు ఇచ్చేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఈ నేప‌థ్యంలో ఈ నెల 20 నుంచి 30 వ‌ర‌కు ప‌దిరోజుల పాటు గ్రామ వ‌లంటీర్లు ఇంటింటికి వెళ్ల‌నున్నారు. ప్ర‌తి కుటుంబం త‌మ పూర్తి వివ‌రాల‌ను వ‌లంటీర్లు అంద‌జేసి స‌హ‌క‌రిస్తే ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు అర్హుల‌వుతార‌ని, కావున ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లాలో జేసీ గౌత‌మి నేతృత్వంలో స‌ర్వేపై విస్తృతంగా ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు. గ్రామ‌, మండ‌ల‌, జిల్లాస్థాయిల్లో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నారు. స‌ర్వే ముఖ్య ఉద్దేశాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.

ప్ర‌ధానంగా రేష‌న్ కార్డు స్థానంలో జ‌గ‌న్ స‌ర్కార్ నాలుగు కొత్త కార్డులను వ‌చ్చే నెల 20 నుంచి ఇవ్వ‌నున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఈ కార్డుల ద్వారానే 90 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక ప‌థ‌కం త‌ప్ప‌కుండా అందుతుంద‌ని వివ‌రిస్తున్నారు. వైఎస్సార్ న‌వ‌శ‌కం పేరుతో లబ్ధిదారుల‌కు ప్ర‌భుత్వం బియ్యం కార్డులు, వైఎస్సార్ పెన్ష‌న్ కార్డులు, ఆరోగ్య‌శ్రీ కార్డులు,  జ‌గ‌నన్న విద్యాదీవెన‌-జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్డుల‌ను అంద‌జేస్తుంద‌ని అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

వ‌లంటీర్లు త‌మ‌కు అందిన స‌మాచారం మేరకు ల‌బ్ధిదారుల జాబితాను త‌యారు చేసి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శిస్తార‌న్నారు. సామాజిక త‌నిఖీ కోసం ఐదురోజుల గ‌డువు ఇస్తారు.  ఈ కాలంటో  జాబితాల‌ను పరిశీలించి అభ్యంత‌రాలు, మార్పులు, చేర్పులు సూచించ‌వ‌చ్చు. అన్ని స‌క్ర‌మ‌మైన‌, వాస్త‌విక‌మైన స‌మాచారం ఆధారంగా తుది జాబితా త‌యార‌వుతుంది.

 అనంత‌రం గ్రామ‌, వార్డు స‌భ‌ల్లో తుది జాబితాను ఆమోదిస్తారు. కొత్త‌కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను డిసెంబ‌ర్ 20 నుంచి ప్రారంభిస్తారు. ఏ మాత్రం వివ‌రాలు స‌రిగా అందించ‌క‌, తుది జాబితాలో పేర్లు లేక‌పోతే ప‌థ‌కాలు అంద‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కావున‌ స‌ర్వేలో ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క పాల్గొనాల‌ని క‌డ‌ప జిల్లా అధికారులు చేస్తున్న విజ్ఞ‌ప్తికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. 
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News