రామోజీరావుకి షాకిచ్చించేదుకు సిద్ధమయిన సర్కారు

By Raju VS Sep. 19, 2020, 05:07 pm IST
రామోజీరావుకి షాకిచ్చించేదుకు సిద్ధమయిన సర్కారు

అందరికీ నీతులు చెప్పే బల్లి కుడిలో పడితే ఏం జరుగుతుందో తెలుసా.. రామోజీరావు ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అందరికీ సుద్దులు చెప్పే ఈ రాజగురువు ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత అసలు జీర్ణించుకోలేని స్థితికి చేరుకున్నారు. ఆక్రమంలోనే అర్థ సత్యాలను ఆశ్రయించి అందరినీ నమ్మించాలనే పనిలో పడ్డారు. కానీ చివరకు అడ్డగోలుగా అవాస్తవాలను వల్లించే క్రమంలో ఆయనే ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన పరువు నష్టం నోటీసులతో ఇక్కట్లు కొనితెచ్చుకున్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు సహకారంతో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. పైగా టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈలోగానే టెండర్ల విషయంపై ప్రజల్లో అపోహలు, అనుమానాలు పెంచేందుకు ఎల్లోమీడియా రంగంలో దిగింది. ఈనాడు అయితే మరింత బరితెగించింది. ఫలించిన గుత్తేదారుల వ్యూహం, సీమ గుత్తేదారులే అధికం అంటూ కథనం అల్లేసింది. ఎన్ఐసి ప్లాట్‌ఫామ్ ద్వారా, గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహించినా దాని చుట్టూ అర్థ సత్యాలే వల్లించడానికి వెనకాడలేదు. ఇ-టెండర్ తో పాటు 25 బిడ్స్ వచ్చిన విషయాన్ని వక్రీకరించి రాసిన కథనం వివాదాస్పదమయ్యింది.

దాంతో రూ.2,978 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతుంటే ప్రజల్లో అపోహలు పెంచి, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేయడం పట్ల సీరియస్ యాక్షన్ కి సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా నేరుగా రామోజీరావు, ఆయన తనయుడు కిరణ్‌ తో పాటుగా ఎడిటర్ ఎం నాగేశ్వర రావుతో పాటుగా బ్యూరో చీఫ్ కి లీగల్ నోటీసులు పంపించారు. నేరుగా ఎంటీ కృష్ణబాబు పేరు మీదుగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈనాడు కథనానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే తదుపరి చర్యలు తప్పవని నోటీసులో పేర్కొన్నారు. దాంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

ఇప్పటికే గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వం మీద అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలోనూ బుదర జల్లేందుకు రామోజీరావు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పరంపరలో రోడ్ల నిర్మాణం టెండరింగ్ అంశాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు హయంలో ఎక్కువ ధరలకు టెండర్ వేసి మొబలైజేషన్ అడ్వాన్సులతో బారీగా లాభపడిన రామోజీ సమీప బంధువులను పోలవరం కాంట్రాక్ట్ నుంచి తప్పించి, తక్కువ ధరకు టెండర్ వేసిన వారికి అప్పగించడం వారికి అసలు గిట్టడం లేదు. దాంతో రాజకీయంగా చంద్రబాబు పదవి కోల్పోవడం, మరోవైపు జగన్ పారదర్శకంగా టెండరింగ్ విధానంలో మార్పులు తీసుకురావడం సహించలేని సెక్షన్ చేస్తున్న ప్రయత్నాలకు తార్కాణంగా తాజా కథనాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నోటీసులతో రామోజీరావు క్షమాపణలు చెబుతారా లేక కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతారా అన్నది చూడాలి. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp