సీఎం జగన్‌.. చేయాల్సిందంతా కామ్‌గా చేస్తున్నారు..!

By Kotireddy Palukuri Jul. 31, 2020, 11:35 pm IST
సీఎం జగన్‌.. చేయాల్సిందంతా కామ్‌గా చేస్తున్నారు..!

మానవాళికి మహమ్మరిగా మారిన కరోనా వైరస్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి రాదన్న విషయం అందిరికీ తెలసిందే. అయితే ఈ లోపు జాగ్రత్తగా ఉంటూ వైరస్‌ సోకిన వారిని కాపాడుకోవడం, మరణాల సంఖ్య వీలైనంత వరకు తగ్గిండంపై జగన్‌ సర్కార్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి రోజు అర లక్ష మందికి పరీక్షలు చేయడం, వైరస్‌ సోకిన వారికి ఉచితంగా వైద్యం అందించడం వంటి చర్యలను ఎలాంటి ప్రచారార్భాటం లేకుండా కామ్‌గా ఏపీ ప్రభుత్వం చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రులలో దాదాపు 35 వేల బెడ్లు సిద్ధం చేసింది. మరో 10 వేల బెడ్లు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల సీఎం జగన్‌ ఆదేశించారు. ఇలా ఓ పక్క కరోనాపై పోరు సాగిస్తూనే ఆ మహమ్మరి బారినపడిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. ఉచిత వైద్యం, పౌష్టికాహారం, క్వారంటైన్‌ నుంచి వెళ్లే సమయంలో రెండు వేల రూపాలయ నగదుతోపాటు ఎవరైనా మరణిస్తే.. అంత్యక్రియలకు ఇబ్బందులు లేకుండా వారి కుటుంబానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం ఏపీ ప్రభుత్వం చేస్తోంది.

అయితే వైరస్‌ మరణాలను తగ్గించేందుకు వీలైనంత మేరకు చర్యలు చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న జగన్‌ సర్కార్‌ ప్లాస్మా చికిత్స ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న భావనతో ప్లాస్మా సేకరణలో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ సోకి నయం అయిన వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అయితే దీనిపై అవగాహన లేక దాతలు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేసే వారు.. ఆ తర్వాత మంచి పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఐదు వేల రూపాయల ప్రాత్సాహకం ప్రకటించింది. ఈ రోజు కరోనాపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp