సంక్షేమం – అభివృద్ధి : ఏపీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు

By Karthik P May. 04, 2021, 05:02 pm IST
సంక్షేమం – అభివృద్ధి : ఏపీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రైతులు, మత్స్యకారులు, విద్య, ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..

– ఈ నెల 13వ తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు. 54 లక్షల మందికి 4,050 కోట్ల రూపాయలు జమ.

– ఈ నెల 18వ తేదీన మత్య్సకార భరోసా పథకం అమలు. 1.30 లక్షల మందికి లబ్ధి.

– ఈ నెల 25వ తేదీన 2020 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 38.30 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ ఉచిత పంటల భీమా కింద 2,589 కోట్ల పరిహారం వారి ఖాతాల్లో జమ.

– 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ సిలబస్‌కు ఆమోదం.

– ఏపీ ప్రైవేటు యూనివర్సిటీ చట్టం 2016లో మార్పులకు ఆమోదం. 35 శాతం కింద కన్వీనర్‌ కోటా. అందులోచేరే పేద విద్యార్థులకు ఫీజురియంబర్స్‌మెంట్‌. వసతి దీవెన పథకాలు వర్తింపు.

– నిర్వహణ కష్టమైన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను వాటి యాజమాన్యాల ఇష్టపూర్వకంగా ప్రభుత్వానికి సరండర్‌ చేసే అవకాశం కల్పించేందుకు ఆమోదం.

– ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 2.5 శాతం స్వల్ప కాలిక వడ్డీకి 1860 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి ఆమోదం.

– రాష్ట్రంలో మూసేసిన సహకార డైరీలను అమూల్‌కు అప్పగించేందుకు నిర్ణయం.

– ప్రకాశం కోఆపరేటివ్‌ పాల ఉత్పత్తిదారులు సంఘం (ఒంగోలు డైరీ) పునరుద్ధరణకు 69 కోట్ల రూపాయల సాయం.

– శ్రీకాకుళం జిల్లా వెన్నెల వలస, చిత్తూరు జిల్లా కుదుం గ్రామంలో పశుసంవర్థక పార్క్‌లు ఏర్పాటు.

– ఆలయాల్లోని అర్చకులకు గౌరవ వేతనం పెంపు. ఎ కేటగిరీ ఆలయాల్లోని అర్చకులకు 10 వేల నంచి 15 వేలకు పెంపు. బి కేటగిరీలో 5 వేల నుంచి 10 వేల పెంపు. ఇమామ్‌లకు 5 నుంచి 10, మౌజంలకు 3 నుంచి 5 వేల రూపాయలు పెంపు. రిజిస్టర్‌ చర్చి పాస్టర్లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం.

– కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు మార్పునకు ఆమోదం.

– ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అసైన్మెంట్‌ భూములు సేకరించాల్సి వస్తే.. పట్టా భూమి కన్నా.. పది శాతం ఎక్కువ పరిహారం చెల్లింపు.

– వేమన యూనివర్సీటీలో ఆధ్వర్యంలో ప్రొద్దూటూరులో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు, వేంపల్లిలో డిగ్రీ కాలేజీ అభివృద్ధికి నిధులు, పోస్టులు మంజూరు.

– 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం. 511.79 కోట్ల నిధులు మంజూరు. మైదాన ప్రాంతాల్లో మండాల్లో రెండు, గిరిజన మండలాల్లో మూడు ప్రభుత్వ ఆస్పతులు ఉండేలా కేటాయింపు.

– చిత్తూరు జిల్లా కోటార్లపల్లిలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి భూమి కేటాయింపు.

– గ్రీన్‌ల్యాండ్‌ 65 ఎకరాల భూమి కేటాయింపు.

– అడిడాస్‌కు పులివెందుల, శ్రీకాళహస్తిలో 65 ఎకరాల భూమి లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం.

– కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని లిబర్టీ నుంచి ఎస్‌ఆర్‌ స్టీల్‌కు అప్పగింత.

– చెన్నై– బెంగళూరు, హైదరాబాద్‌– బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు మధ్యలో ఉన్న కృష్ణపట్నంలో 1448 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన.

– కైలాసగిరి– భోగాపురం మధ్య ప్రాంతాన్ని అభివృద్ధికి నిర్ణయం. 19 కిలోమీటర్ల పరిధిలో ఆరు నుంచి 8 వరసల రోడ్ల నిర్మాణం. కైలాస గిరి వద్ద స్కై టవర్‌ నిర్మాణం. 11 బీచ్‌ల నిర్మాణం సహా 12 ప్రాజెక్టుల ఏర్పాటు.

– హంద్రీ నీవా – సుజల స్రవంతి సామర్థ్యం పెంపునకు నిధులు మంజూరు.

– హంద్రీ నీవా – సుజన స్రవంతి ఫేజ్‌ 2 కు 9,018 కోట్ల మంజూరు.

– పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి కరువు ప్రాంతానికి నీరు.

– 470 కోట్లతో ఏలూరు – తాండవను కలుపుతూ కాలువ.

– పల్నాడు కరువ నివారణ ప్రాజెక్టు కోసం 2,746 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం.

– ఎలక్ట్రానిక్‌ పార్కులలో 80 శాతం ఉద్యోగాలు మహిళలకు కల్పించేలా నూతన విధానానికి ఆమోదం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp