దమ్మాలపాటిపై మరో కేసు, అమరావతి పేరుతో మోసపోయినట్టు ఫిర్యాదు

By Rahul.G Sep. 26, 2020, 08:30 am IST
దమ్మాలపాటిపై మరో కేసు, అమరావతి పేరుతో మోసపోయినట్టు ఫిర్యాదు

చంద్రబాబు హయంలో చక్రం తిప్పిన మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అమరావతి పేరుతో సాగించిన రియల్ దందాలలో ఆయన పేరు మళ్లీ ముందుకొచ్చింది. ఆయనతో పాటుగా భార్య సహా పలువురు బంధువుల పేర్లతో కేసు నమోదయ్యింది. ఇప్పటికే ఆయన వ్యవహారాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

అమరావతిలో భూ కొనుగోళ్లలో సాగించిన అక్రమాలపై ఏసీబీ కోర్ట్ నమోదు చేసింది. దానిపై ఆయన హైకోర్టుకెళ్లారు. చివరకు గ్యాగ్ ఆదేశాలు రావడంతో ఎఫ్ ఐ ఆర్ లో అంశాలు ప్రస్తావించకూడదని కోర్ట్ ఆదేశాలు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక గ్యాగ్ ఆర్డర్ కేసులో విచారణ ఈనెల 29కి వాయిదా పడింది.
ఆ కేసు పెద్ద చర్చకు దారితీసిన తరుణంలో అమరావతి పరిధిలోని కృష్ణాయపాలంలో అపార్ట్ మెంట్ నిర్మాణం పేరుతో తనన మోసగించినట్టు విజయవాడకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ కోడె రామ్మోహన్ రావు ఫిర్యదుతో మరో సారి దమ్మాలపాటి బండారం బయటపడింది.

కృష్ణాయపాలెంలో లేక్ వ్యూ అపార్టమెంట్ పేరుతో తన వద్ద రెండు ఫ్లాటులకు డబ్బులు తీసుకుని ఒకటే ప్లాట్ రిజిస్టర్ చేశారని బాధితుడు వాపోతున్నారు. రూ. 75 లక్షలు తీసుకుని తనను మోసం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అప్పట్లో లేక్ వ్యూ అపార్ట్ మెంట్ పక్కనే స్టార్ హోటల్ వస్తుందని చెప్పారని బాధితుడు అంటున్నారు. తాను ఏజీగా ఉన్నందున అమరావతి వ్యవహారాలన్నీ తనకు తెలుసునంటూ దమ్మాలపాటి తనకు చెప్పారని ఆరోపిస్తున్నారు.

బాధితుడి ఫిర్యాదుతో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణి కూడా ఈ కేసులో నిందితులుగా ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. దమ్మాలపాటి బావమరిది, క్యాపిటల్ హౌసింగ్ ఎండీ నన్నపనేని సీతారామరాజుని ఏ1గా పేర్కొన్నారు. తాను డబ్బులు అడుగుతుంటే తప్పుడు కేసులు పెట్టిస్తానని బెదిరించారని బాధితుడు వాపోవడంతో చీటింగ్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp