ఆ ప్రభుత్వం కూలటంలో జగన్ పాత్ర, ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి అర్థమయ్యేదేమంటే..

By Raju VS Mar. 03, 2021, 06:40 pm IST
ఆ  ప్రభుత్వం కూలటంలో  జగన్ పాత్ర, ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి అర్థమయ్యేదేమంటే..

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పటికే అంగీకరించినట్టుగా ఏపీలో ప్రతిపక్షాలు జగన్ ఎత్తుల ముందు చిత్తవుతున్నాయి. ప్రజల్లో జగన్ కి పెరుగుతున్న ఆదరణ ఇతర పార్టీల నేతలకు అందనంత ఎత్తులో ఆయన నిలబడేందుకు దోహదం చేస్తున్నాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కే అనుకుంటే ఏబీఎన్ రాతలను బట్టి జగన్ హవా పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. జగన్ మూలంగానే పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిందని రాధాకృష్ణ వండి వార్చిన వార్తను బట్టి దేశమంతటా జగన్ ఇమేజ్ మారుమ్రోగుతున్నట్టు కనిపిస్తోంది.

Also Read:పాండిచ్చేరిలో కుప్పకూలిన ప్రభుత్వం!

ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిక్కిం బదిలీ చేస్తే అది జగన్ వల్లనేనని ఆంద్రజ్యోతి పేర్కొంది. ఇప్పుడు పాండిచ్చేరిలో నారాయణ స్వామి ప్రభుత్వం కూలిపోతే దానికి కూడా కారకుడు జగన్ అనే అంటోంది. అంటే ఇన్నాళ్లుగా ఏపీలో ఏం జరిగినా జగన్ కి ముడిపెట్టడం అలవాటుగా మార్చుకున్న పచ్చమీడియాకు ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది జగన్ పుణ్యమేనని పేర్కొనేందుకు వెనుకాడేలా లేదు.

ఆంధ్రజ్యోతి రాతల్లో పేర్కొన్నట్టుగా యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు రాజీనామా తర్వాత అక్కడ పలువురు రాజీనామాలు చేశారన్నది అర్థసత్యం. నిజానికి మల్లాడి కృష్ణారావు కన్నా ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ తర్వాత మల్లాడి వంతు వచ్చింది. పైగా మల్లాడి కృష్ణారావు తనకు పాండిచ్చేరి పాలిటిక్స్ ఆసక్తి లేదని ప్రకటించి ఆరు నెలలు గడిచింది. పైగా తనకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశం ఇవ్వాలని ఆయన కోరిన విషయం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఆయన రాజీనామా, పాండిచ్చేరిలో ఇతర నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణమయితే దానిని కూడా జగన్ కే ముడిపెట్టే యత్నం చేయడం విడడ్ఊరంగానూ, విచిత్రంగానూ ఉంది. జగన్ బలాన్ని రాధాకృష్ణ అందరికన్నా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Also Read:జగన్ కోసం పదవిని వదులుకుంటానంటున్న పక్క రాష్ట్ర మంత్రి

ఆంధ్రజ్యోతి కథనంలో కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయని పేర్కొన్నారు. నిజానికి జగన్ ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో సఖ్యంగా మెలిగేందుకు ప్రాధాన్యతనిస్తున్న విషయం వాస్తవమే. కానీ తనకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ సమానదూరమేనని ఆయన ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. తన బలం మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని ఆయన కోరుకున్న విషయాన్ని కూడా కాదనలేం.

Also Read:ఆంధ్రజ్యోతి రాస్తున్న బీజేపీ నేతల 30 కోట్ల డీల్ దేని గురించి?

కానీ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా రావడంతో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఏదో మేరకు సాధించే సంకల్పంతోనే సాగుతున్న సంగతి ప్రజలు గుర్తించారు. అయినప్పటికీ బీజేపీ బలోపేతానికి జగన్ సహకరిస్తున్నట్టు, ఏకంగా కాంగ్రెస్ ముక్తి భారత్ కోసం ప్రయత్నిస్తున్నారని కథనాలు రాయడం ఆశ్చర్యమే. ఇప్పటికే ఏపీలో జగన్ తో పెట్టుకుని కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి అర్థసత్యాలను నిజంగా కాంగ్రెస్ విశ్వసిస్తే ఆపార్టీకే నష్టం. బహుశా కాంగ్రెస్ కి చేటు చేయాలనే సంకల్పంలో అందరి మీద అనుమానాలు పెంచే దిశలో రాధాకృష్ణ ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్టు కనిపిస్తోందన్నది పలువురి అంచనా.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp