’స్టార్ సీక్రెట్స్’ పేరుతో ఆంధ్రజ్యోతి అందించిన ఆవుకథ

By Phani Kumar Jun. 27, 2020, 12:03 pm IST
’స్టార్ సీక్రెట్స్’ పేరుతో ఆంధ్రజ్యోతి అందించిన ఆవుకథ

అవును, పోయిన పరువును తిరిగి సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి ప్రత్యర్ధులపైన కూడా బురద చల్లేస్తే సరిపోతుందని ఎల్లోమీడియా చేసిన ప్రయత్నమే ఇది. బ్యానర్ కథనంగా ’స్టార్ సీక్రెట్స్’ అంటూ శనివారం ఓ కథనాన్ని అచ్చేసింది. మొన్నటి 23వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో బిజెపి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ జరిపిన రహస్య భేటి సీసీ ఫుటేటి వీడియోలు బయడపడటం ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. బిజెపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి, మాజీమంత్రి కామినేని శ్రీనవాసరావు, ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13వ తేదీన జరిపిన రహస్య భేటి తాలూకు విషయం బట్టబయలైంది.

దానికి బదులుగా ఈరోజు ఎల్లోమీడియా స్టార్స్ సీక్రెట్ అంటూ ఓ ఆవుకథను అచ్చేసింది. అదేమిటయ్యా అంటే పార్క్ హయత్ హోటల్లోనే వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలు కూడా సుజనా చౌదరిని కలిశారట. సుజనా, నిమ్మగడ్డ, కామినేని రహస్య భేటి వీడియోలు సేకరించిన పోలీసులకు వైసిపి నేతలు కూడా సుజనాను కలిసిన వీడియోలు దొరికాయట. వాటిని చూడగానే వైసిపి ముఖ్యనేతల్లో కంగారు మొదలైందట. నిజానికి ఇంత లాజిక్ లేని కథనాలు అల్లటంలో ఎల్లోమీడియా చాలా ఆరితేరిపోయింది. వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలు సుజానను ఎందుకు కలిశారంటే పార్టీలోని తమ బాధను చెప్పుకోవటానికట.

ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ నిజంగానే ఎంపిలు, ఎంఎల్ఏలు బాధలు పడుతున్నదే నిజమనుకుందాం. మరి వాళ్ళ బాధను సుజనా ఏ విధంగా తీరుస్తాడు ? తమ సమస్యలను సుజనా తీర్చలేడన్న విషయం వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలకు తెలీదా ? మరలాంటపుడు సుజనాను కలవటం వల్ల ఉపయోగం ఏమిటి ? సుజనాను ఎంపిలు కలవదలచుకుంటే హైదరాబాద్ కన్నా ఢిల్లీలో కలవటమే సేఫ్ కదా ? ఇంతచిన్న విషయం తెలినీ వాళ్ళు కాదు కదా వైసిపి ఎంపిలు. నిజానికి ఎంపిల్లో కానీ, ఎంఎల్ఏల్లో కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అసంతృప్తి ఉండాల్సిన అవసరమే లేదు.


పైగా సుజనాను వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలు కలుస్తున్న విషయం కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రికి తెలిసిందట. కొంతమంది ఎంఎల్ఏలతో మంత్రి సమావేశమైనపుడు ఈ విషయాన్ని స్వయంగా మంత్రే బయటపెట్టాడని ఎల్లోమీడియా చెప్పింది. సుజనాను వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలు కలవటమే నిజమైతే, అందుకు వీడియో సాక్ష్యాలుంటే ఎల్లోమీడియా ప్రసారం చేయకుండా వదిలిపెడుతుందా ? ఏమీ లేని చోటే ఏదో జరిగిపోయిందని నానా గోల చేసే ఎల్లోమీడియా ఇంతపెద్ద విషయాన్ని వదిలిపెట్టదు.

ఇంత పెద్ద కథనం రాసిన ఆంధ్రజ్యోతి చివరకు సుజనాను కలుసిన ఎంపిలు, ఎంఎల్ఏలు బిజెపిలో చేరుతారని అనలేం అని కూడా మంత్రి అన్నట్లు రాసింది. అంటే ఇక్కడే తెలిసిపోతోంది ఎల్లోమీడియా కథనం ఎంత ఇల్లాజికల్ గా ఉందో. సుజనా, కామినేని, నిమ్మగడ్డ రహస్య భేటితో బిజెపి పరువు పోయిందన్నది వాస్తవం. రహస్య భేటి విషయం బయటపడినపుడు నిమ్మగడ్డకు పోయేదేమీ లేదు. వ్యక్తిగతంగా సుజనాకు కానీ కామినేనికి కానీ జరిగే నష్టం కూడా లేదు. మధ్యలో బద్నాం అయ్యింది బిజెపినే. అందుకనే పోయిన పరువును ఎలాగూ తేలేం కాబట్టి ప్రత్యర్ధులపైన కూడా బురద చల్లేసి ఆనందపడదామన్న ప్రయత్నంలో భాగమే స్టార్ సీక్రెట్స్ కథనం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp