అమూల్ శిక్షణా తరగతులు

By Krishna Babu Aug. 13, 2020, 09:00 pm IST
అమూల్ శిక్షణా తరగతులు

రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వలన చితికిపోయిన పాడి పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టి సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమూల్ సంస్థతో ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంతో ఆంద్రప్రదేశ్ లో ప్రైవేటు డైరీల ఆధిపత్యాన్ని నిలువరంచి పాడి రైతులకి మరింత ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 7వేల పాల ఉత్పత్తి దారుల మహిళా సంఘాలని ఏర్పాటు చెయడానికి సహకార శాఖలో డిప్యుటీ రిజిస్టర్లను, ఇతర ఉన్నతాధికారులని ఎంపిక చేసింది. ఈ నేపధ్యంలో అమూల్ సంస్థ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో తన కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారులకు సంస్థ పాల ఉత్పత్తి సేకరణ, మార్కెటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది.

ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారులు గుజరాత్ లోని అమూల్ కేంద్రంలో సుమారు 20రోజుల పాటు శిక్షణ పొంది తిరిగి వచ్చిన అనంతరం ఒక్కో జిల్లాలోని 15 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇలా శిక్షణ పొందిన మహిళలు తమ పరిధిలోని మిగిలిన సభ్యులకి శిక్షణ ఇచ్చి రాబోయే రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన 7వేల పాల ఉత్పతిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నారు . ప్రభుత్వం ఇప్పటికే లీటరుకు 4 రూపాయలు చొప్పున బోనస్‌ ఇవ్వబోతున్నటు ప్రకటించిందని, ఇప్పుడు చేపట్టిన ఈ చర్యతో రాష్ట్రంలో పాడి పరిశ్రమ తిరిగి జీవం పోసుకోబోతున్నట్టు పాడి రైతులు అభిప్రాయ పడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp