అలాగైతే లోకేష్ ను ఎందుకు ఓడించారు..!

By Voleti Divakar Jul. 12, 2020, 08:50 pm IST
అలాగైతే లోకేష్ ను ఎందుకు ఓడించారు..!

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ టిడిపి ప్రతిష్టాత్మకంగా భావించిన రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని, నిర్మించామని చెప్పిన చోట టిడిపి అధినేత తనయుడు కు స్థానిక ప్రజలు ఓటు వేయలేదు. రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే బాపట్ల పార్లమెంటు స్థానంలో కూడా టిడిపి ఓటమిపాలైంది. ఆనాడు లోకేష్ ను స్థానిక ప్రజలు ఓడించిన విషయాన్ని మర్చిపోయిన టిడిపి స్పాన్సర్ ఉద్యమకారులు నేడు వింత వాదనకు తెరలేపారు.

రాజధాని అమరావతికి వ్యతిరేకంగానే ఓటర్లు తీర్పునిచ్చినట్లు గత ఎన్నికల ఫలితాలు తేటతెల్లమైంది. ఈవిషయాన్ని మర్చిపోయిన టిడిపి ఉద్యమకారులు వింతవాదనకు తెరతీస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా కోస్తా ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, మళ్లీ గెలవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతికి వ్యతిరేకంగానే గత ఎన్నికల్లో తీర్పునిచ్చినట్లు స్పష్టమవుతున్నా రాజధాని ఉద్యమకారులకు మాత్రం ఆవిషయం అర్థమైనట్లు లేదు. రాజధాని ఉద్యమం పట్ల స్థానిక ప్రజల్లో ఆసక్తి లేకపోయినా రోజుకో ఫొటో పెట్టు.... రాజధాని ఉద్యమాన్ని రెచ్చగొట్టు అన్నట్లు రాజధాని ఉద్యమకారులు, టిడిపి అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. టిడిపి నాయకులు, వారి అనుకూల మీడియా ఉద్యమాన్ని నిలబెట్టేందుకు విఫలయత్నం చేస్తోంది.

రాజధాని పరిధిలోని 29 గ్రామాలు ఉండగా, కేవలం 4-5 గ్రామాల ప్రజలు, అందులో టిడిపి అనుకూల వ్యక్తులే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వారు కూడా రోజుకో గంట పాటు ఫొటోలకు ఫోజులిచ్చి తమ రోజూవారీ విధుల్లో మునిగిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీన్నే పెద్ద ఉద్యమంగా టిడిపి పచ్చమీడియా హడావుడి చేస్తోంది. రాజధాని ఉద్యమానికి ఆ మీడియా సంస్థలకు ఉన్న సంబంధం ఏమిటో...రాజధాని రైతుల పై వాటికున్న ప్రేమ ఏమిటో సామాన్య ప్రజలకు అంతుబట్టకుండా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఈ సంస్థల పెద్దలకు కూడా రాజధాని పరిధిలో భూములు కేటాయించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp