ఆ కామ్రేడ్ పలుకే బంగారమాయె..!

By Thati Ramesh Sep. 15, 2021, 01:00 pm IST
ఆ కామ్రేడ్ పలుకే బంగారమాయె..!

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతో దూకుడుగా పాలక పక్షంపై ఫైర్ అయ్యేవారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను కఠువైన మాటలతో తూర్పరబట్టేవారు. అలాగే సీపీఎం విధానాలపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్ చేసేవారు. అయితే పొలిట్ బ్యూరో మెంబర్ గా ప్రమోషన్ పొందిన తర్వాత మాత్రం అందులో పావు శాతం కూడా మెయింటెన్ చేయడం లేదు. పార్టీలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ మీడియా ముందుకు వస్తున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ప్రజా సమస్యలు, పొలిటికల్ డెవలప్‌మెంట్స్ పై సీపీఐ నేత నారాయణ స్పందనలతో పోల్చుకుంటే బీవీ రాఘవులు మాత్రం పలుకే బంగారమన్నట్లుగా ఉన్నారనే విశ్లేషించవచ్చు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా చురుకుగా ఉంటూ పదునైన పదాలతో అధికారపార్టీ తీరును ఎండగట్టేవారు. భావోద్వేగాలకు లోనుకాకుండా ఆచితూచి ప్రసగించే రాజకీయ నేతల్లో రాఘవులు ఒకరు. తాను చెప్పాలనుకున్న విషయాన్నిసూటిగా సరళంగా చెబుతుంటారు. ప్రస్తుతం ఈ కరుడుగట్టిన మార్కిస్టు దూకుడు తగ్గడానికి కారణం పొలిట్ బ్యూరో మెంబర్ గా బాధ్యతలు చేపట్టడంతో మారిన ప్రొటోకాల్ కూడా కావచ్చు.

సీపీఎం సోషల్ మీడియాలో యాక్టివ్ గా..

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యటిస్తున్నారు. సీపీఎం చేపట్టే ఆందోళనలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ సంబంధిత విషయంపై మాత్రమే స్పందిస్తున్నారు. CAA, NRCకి వ్యతిరేకంగా గత ఏడాది చివరిలో విశాఖ లో జరిగిన సభలో పాల్గొన్న రాఘవులు .. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి విశాఖలో పర్యటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపి కేంద్రం తీరును తప్పుబట్టారు. సోషల్ మీడియా వింగ్ ద్వారానే ఆయన ఎక్కువగా పబ్లిక్ తో టచ్ లోకి వెళుతున్నారు.

Also Read : వైయస్సార్ పట్ల ఆ విప్లవ రచయిత అభిప్రాయం ఎందుకు మారింది?

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

రీసెంట్ గా విజయవాడలో జరిగిన సభలో పాల్గొన్న బీవీ రాఘవులు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేశారు. కరోనాను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కేంద్రప్రభుత్వ తీరుతో దేశ ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయిందని ఆరోపించారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడమే బీజేపీ లక్ష్యమని.. సంక్షేమం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సింప్లిసిటీకి కేరాఫ్

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీవీ రాఘవులు.. నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ సమావేశాలకు వెళుతూ చిరుగులున్న చొక్కా వేసుకెల్లి మీడియా కంటబడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. పొడవు చేతుల చొక్కాను మోచేతుల వరకు మడిచి చూడటానికి రఫ్ గా కనిపించినప్పటికీ విమర్శలు చేసేటప్పుడు టంగ్ స్లిప్ అయిన సందర్భాలు లేవు. వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిపై వచ్చే ఆదాయంతోనే అవసరాలు తీర్చుకుని చిరునవ్వులు చిందించే సర్దుబాటు తత్వం ఆయనది. అవినీతి మకిలీ అంటని నిఖార్సైన మార్కిస్టుగా రాఘవులను వామపక్ష అభిమానులే కాక తెలుగు ప్రజలు కొనియాడతారు.

ప్రకాశం జిల్లా వాసి..

ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని మోపాడు బీవీ రాఘువుల స్వస్థలం. హైస్కూల్ లో ఉన్నప్పుడు సైన్స్ పాఠాలు ఇష్టపడే రాఘవులు.. తర్వాత హేతువాదిగా ఆ తర్వాత కమ్యూనిస్టుగా మారారు. ఇంటర్మీడియట్ చదివే సమయంలో జరిగిన ప్రజాఉద్యమాలు ఆయనను కమ్యూనిజం వైపు నడిచేలా చేశాయని చెబుతుంటారు. ఆయన భార్య పుణ్యవతి సీపీఐ(ఎం)లోనే పనిచేస్తున్నారు. కుమార్తె సృజన కూడా విద్యార్థి ఉద్యమంలో చురుకగా పనిచేశారు. మతాంతర వివాహం చేసుకుని తండ్రికి తగ్గ తనయగా నిలిచారు.

Also Read : రఘురామరాజుకు షాక్ - పిటీషన్ కొట్టివేత

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp