ఎట్ట‌కేల‌కు ఏపీలో అడుగుపెట్టిన చంద్ర‌బాబు

By Kalyan.S Sep. 02, 2020, 08:02 pm IST
ఎట్ట‌కేల‌కు ఏపీలో అడుగుపెట్టిన చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు చానాళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టారు. సుమారు రెండు నెల‌ల అనంత‌రం బాబు అమ‌రావ‌తికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి విజ‌య‌వాడ‌లోని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అక్క‌డ అచ్చెన్నాయుడును పరామర్శించారు. 50 రోజుల తర్వాత చంద్రబాబు ఏపీకి వ‌చ్చార‌న్న విష‌యం తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అచ్చెన్న ఇంటికి భారీగా చేరుకున్నారు. అక్క‌డ వారి హ‌డావిడి చూసి క‌రోనా నేప‌థ్యంలో స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సుమారు 80 రోజులు పాటు అచ్చెన్నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. ఇటీవల ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చేరారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈఎస్‌ఐ వైద్యసేవల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్‌ పొందాలని ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.

కొల్లు ఇంటికి కూడా..?

వైసీపీ నేత హత్య కేసులో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టై కొన్నాళ్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు కూడా కొన్ని రోజుల క్రితం బెయిల్ వచ్చింది. దీంతో ప్రస్తుతం కొల్లు రవీంద్ర ఇంట్లోనే ఉంటున్నారు. చంద్రబాబు గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వారిద్దరికీ బెయిల్ వచ్చిన సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారు. తాజాగా, హైదరాబాద్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చిన చంద్రబాబు ఆయ‌న ఇంటికి కూడా వెళ్లి కొల్లును ప‌రామ‌ర్శించ‌నున్నారు. అనంత‌రం కేంద్ర పార్టీ కార్యాల‌యానికి చేరుకుని అందుబాటులో ఉన్న పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చించ‌నున్నారు. చాలా రోజుల త‌ర్వాత చంద్ర‌బాబు జూమ్ నుంచి బ‌య‌ట అడుగు పెట్టడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp