అనిశా వలలో భారీ తిమింగలం

By Kiran.G Aug. 15, 2020, 11:32 am IST
అనిశా వలలో భారీ తిమింగలం

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో అతిపెద్ద తిమింగలం చిక్కింది. ఏకంగా కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆయన పేరు నాగరాజు. ఆయనపై మొదటినుండి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూకట్‌పల్లి నుంచి కీసరకు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అనిశా అధికారులు నిఘా పెట్టడంతో కోటి పది లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే అనిశా అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకోవడం విశేషం.

నాగరాజు ఒకప్పుడు రెవెన్యూశాఖలో టైపిస్ట్‌గా చేరాడు. కాగా పదోన్నతి లభించడంతో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎదిగాడు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. కానీ రాజకీయ పలుకుబడి ద్వారా కేసులను తొలగించుకుని తహశీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఆ క్రమంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం కూకట్‌పల్లి నుంచి కీసరకు బదిలీ కావడంతో మేడ్చల్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారాలు ఊపందుకోవడంతో ఇక్కడ లంచాల స్థాయిని ఏకంగా రూ.కోట్లకు పెంచుకున్నాడు.

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర సర్వే నంబర్లు 604 నుంచి 614 వరకు ఉన్న 44 ఎకరాల భూమిలో 28 ఎకరాలకు సంబంధించి భూ వివాదం నెలకొంది.  ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కాగా ఈ వివాదాస్పద భూమిని, భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్‌ ఇవ్వడం కోసం తహసీల్దార్ నాగరాజు పెద్ద మొత్తంలో రెండు కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తొలివిడతలో భాగంగా కోటి పది లక్షల నగదును నాగరాజుకు ఇవ్వడానికి అంజిరెడ్డి, శ్రీనాథ్‌ శుక్రవారం సాయంత్రం వచ్చారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన అనిశా అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి వీఆర్‌ఏ సాయిరాజ్‌ తహసీల్దార్‌కు సహకరించినట్లు తేలడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp