జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్.. మూడు కేసులు నమోదు

By Kiran.G Aug. 07, 2020, 02:52 pm IST
జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్.. మూడు కేసులు నమోదు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ దక్కిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తాజాగా అనంతపురం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేయడం ఆయనకు షాక్ ఇచ్చే విషయమనే చెప్పాలి..

వివరాల్లోకి వెళితే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం కడప జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. దీంతో తమ నాయకులు విడుదల అయ్యారన్న ఆనందంతో ఆయన అనుచరులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ తాడిపత్రి తీసుకుని వెళ్లారు. కాగా ర్యాలీ నిర్వహణలో ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడంతో పాటు సిఐ దేవేందర్ పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారని ఆయనని దుర్భాషలాడుతూ దూషించారని కేసు నమోదయింది.

విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై ఐపీసీ 353తో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కేసులు ఫైల్ చేశారు అనంతపురం పోలీసులు. దాంతో బెయిల్ దక్కిందన్న ఆనందం నిలవకుండానే మూడు కేసులు నమోదవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒకింత షాక్ తగిలిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp