21 ఏళ్లకే న్యాయమూర్తి

By Kiran.G 21-11-2019 04:51 PM
21 ఏళ్లకే న్యాయమూర్తి

21 సంవత్సరాలకి ఇప్పటి యువత ఏం చేయగలరు? మహా అయితే పీజీ చేస్తూ ఉంటారు. లేకుంటే డిగ్రీ పాస్ కాక ఏళ్ల తరబడి పరీక్షలు రాస్తూ ఉంటారు. అలాంటిది 21 ఏళ్లకే న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నాడో యువకుడు. వివరాల్లోకి వెళ్తే మయాంక్ ప్రతాప్ అనే రాజస్థాన్ యువకుడు రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీసెస్(ఆర్ జెఎస్) పరీక్షలో టాపర్ గా నిలిచి న్యాయమూర్తి పదవికి అర్హత సాధించాడు. దేశంలోనే అత్యంత పిన్న వయసులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న యువకుడిగా రికార్డ్ సృష్టించాడు. గతంలో రాజస్థాన్ జ్యుడీషియల్ పరీక్షకు అర్హత వయసు 23 ఏళ్ళు ఉండేది. ఈ సంవత్సరమే దాన్ని 21 ఏళ్లకు తగ్గించారు.అర్హత తగ్గించిన ఏడాదే అదే వయసులో మయాంక్ ప్రతాప్ న్యాయమూర్తిగా అర్హత సాధించడం విశేషం

రాజస్థాన్ లో మాన్ సరోవర్ కి చెందిన మయాంక్ ప్రతాప్ ఐదేళ్ల LLB కోర్స్ ని రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసాడు.అనంతరం నిర్వహించిన ఆర్ జెఎస్ పరీక్షలో టాపర్ గా నిలిచి పిన్న వయసులో న్యాయమూర్తి పదవి పొందిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. ఈ సందర్భంగా మయాంక్ ప్రతాప్ మాట్లాడుతూ రోజుకి 13 గంటలు చదివానని ఈ ఫలితం చూసి ఎంతో సంతోషించానని తెలిపాడు. తాజాగా విడుదలైన ఆర్ జెఎస్ ఫలితాల్లో దాదాపు 50%పైనే మహిళలు అర్హత సాధించారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News