కాటేసిన కల్తీ మద్యం - పది మంది మృతి

By Rishi K Jan. 12, 2021, 07:13 pm IST
కాటేసిన కల్తీ మద్యం - పది మంది మృతి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనను మరువక ముందే మరో రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పది మంది మృత్యువాత పడటం కలకలం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లా మాన్పూర్, పహావాలి గ్రామాల్లో కల్తీ మద్యం తాగి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానికంగా తయారైన మద్యాన్ని సేవించిన కొందరికి అర్ధరాత్రి నుండి వాంతులు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. పహవాలి గ్రామంలో ముగ్గురు మరణించగా, మన్పూర్ గ్రామంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోని స్టేషన్ హౌస్ ఆఫీసరును వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉన్నతాధికారులు మోరీనా వచ్చి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp