ఊహించలేదు.. లేదంటే కాల్ చేసేదాన్ని

By Kotireddy Palukuri Dec. 02, 2019, 07:34 am IST
ఊహించలేదు.. లేదంటే కాల్ చేసేదాన్ని

తన సోదరి అంత సీరియస్‌ పరిస్థితుల్లో ఉండి ఉంటుందని తాను ఊహించలేకపోయానని దిశ సోదరి పేర్కొంది. తన సోదరి కూడా ఆ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయి ఉంటుందని అన్నారు. దిశ ఘటన పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆమె పలు మీడియా సంస్థలతో మాట్లాడారు.

‘‘చాలా మంది తాను కానీ, తన సోదరి కానీ డయల్‌-100కు కాల్‌ చేయాల్సిందని అంటున్నారు. ఆ పరిస్థితిలో మనమెవరం లేము. అక్క మాత్రమే ఉంది. అక్క అంత సీరియస్‌ పరిస్థితిలో ఉందని నాకు తెలియదు. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారని మేము అనుకోలేదు. అందుకే ప్రమాదాన్ని ఊహించలేకపోయాం. లేకుంటే.. నేను కచ్చితంగా డయల్‌-100కు ఫోన్‌ చేసేదాన్ని’’ అని వివరించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp