జ‌గ‌దేక‌వీరుడిగా చంద్ర‌మోహ‌న్ అయితే? - Nostalgia

By G.R Maharshi Sep. 25, 2020, 12:12 pm IST
జ‌గ‌దేక‌వీరుడిగా చంద్ర‌మోహ‌న్ అయితే? - Nostalgia

ఒక సినిమా ఆడ‌డానికి ఆడ‌క‌పోవ‌డానికి వంద కార‌ణాలుంటాయి. ఆడితే హీరో గొప్ప‌త‌నం, డైరెక్ట‌ర్ ప్ర‌తిభ ఇలా ఏదో చెబుతారు. ఆడ‌క‌పోతే క‌థ‌లో బ‌లం లేద‌ని, డైరెక్ట‌ర్‌లో విష‌యం లేద‌ని ... ర‌క‌ర‌కాల కార‌ణాలు. అంద‌రూ త‌మ‌ది హిట్ సినిమా అనే మొద‌లు పెడ‌తారు. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా సంఖ్య‌లో తేడా ఉండొచ్చు కానీ, ఒక టీం రాత్రీప‌గ‌లూ ప‌నిచేస్తుంది.

మ‌న ద‌గ్గ‌రున్న క‌థ ఎంత ముఖ్య‌మో , హీరో కూడా అంతే ముఖ్యం. జ‌గ‌దేక‌వీరుడు సినిమా చిరంజీవి, శ్రీ‌దేవి కాకుండా చంద్ర‌మోహ‌న్ , జ‌య‌సుధ అయితే ఆడేది కాదు. అడ‌విరాముడులో ఎన్టీఆర్ కాకుండా నాగేశ్వ‌ర‌రావు అయితే ఊహించుకోడానికే భ‌య‌మేస్తుంది. దేవ‌దాసులో ANR కాకుండా NTR అయితే జ‌నం పారిపోయే వాళ్లు. యాక్ష‌న్ సినిమాల్లో న‌టిస్తున్న కృష్ణ ఉన్న‌ట్టుండి మందు బాటిల్ ప‌ట్టుకుని దేవ‌దాసులా క‌నిపించే స‌రికి Exit లో తొక్కిస‌లాట జ‌రిగింది. కృష్ణ‌లో ధైర్యం , సాహ‌సం ఎక్కువ అన‌డానికి ఈ సినిమానే ఉదాహ‌ర‌ణ‌. క్లాసిక్‌లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకున్నాడు. ఆ త‌ర్వాత కూడా కురుక్షేత్రంలో అర్జునుడు వేసి భ‌య‌పెట్టాడు.

క్రైం సినిమాల్లో కృష్ణ రెండు చేతుల‌తో రివాల్వ‌ర్ కాలుస్తుంటే శోభ‌న్‌బాబుకి కూడా ఆశ పుట్టింది. కిలాడీ బుల్లోడు, దెబ్బ‌కు ఠా దొంగ‌ల ముఠాలో తుపాకి ప‌ట్టుకుని కాల్చాడు. ప్రేక్ష‌కులు గాయ‌ప‌డ్డారు. ANR కూడా మారువేషాలు వేసి దొర‌బాబు అంటూ వ‌స్తే జ‌నం బాబోయ్ అని అరిచారు. శంక‌రాభ‌ర‌ణంలో సోమ‌యాజులు బ‌దులు గుమ్మ‌డి చేస్తే రొటీన్ అయి జ‌నం తిప్పికొట్టే వాళ్లేమో!

పౌరాణిక , హిస్టారిక‌ల్ సినిమా పాత్ర‌ల‌కి తాను ఫిట్ అవుతాన‌ని ఎన్టీఆర్ న‌మ్మ‌కం. అది నిజం కూడా. మొగ‌ల్ ఏ అజంలో అక్బ‌ర్‌గా పృధ్వీరాజ్ క‌పూర్ అద్భుతంగా న‌టించాడు. ఆ సినిమాని తెలుగులో అక్బ‌ర్ స‌లీం అనార్క‌లిగా తీసి ఎన్టీఆర్ అక్బ‌ర్‌గా చేస్తే , ఆయ‌నేం భాష మాట్లాడుతున్నాడో అర్థం కాక జ‌నం జ‌డుసుకున్నారు. అదే విధంగా ముదిమి వ‌య‌సులో విశ్వామిత్ర‌గా వేసి మీనాక్షి శేషాద్రి ప‌క్క‌న చిందులేస్తే వాల్‌పోస్ట‌ర్ల ఖ‌ర్చులు కూడా రాలేదు. ఒక్కో సారి కొన్ని కుద‌ర‌వు. ప‌బ్లిసిటీ వ‌ల్ల సినిమాలు ఆడేలా ఉంటే ఈ సినిమాకు వ‌చ్చిన ప‌బ్లిసిటీ దేనికీ రాలేదు.

జ‌నం దృష్టిలో ఒక్కొక్క‌రికీ ఒక్కో బ్రాండ్ ఏర్ప‌డుతుంది. దానికి అనుగుణమైన క్యారెక్ట‌ర్ వేసినా , ఇత‌ర‌త్రా కూడా క‌లిసి రావాలి. అయితే హీరోని బ‌ట్టి క‌థ‌ని చేసుకోవ‌డం ఎప్ప‌టి నుంచో ఉంది. ఇంద్ర‌ద‌న‌స్సు అనే సినిమాలో కృష్ణ భ‌గ్న ప్రేమికుడిగా పాట‌లు పాడాడు. అన్నీ హిట్‌సాంగ్స్ కానీ ఆడ‌లేదు.

హీరోల‌కి ఒక ముద్ర ప‌డితే , దాన్నుంచి బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్టం. క‌మ‌ల్‌హాస‌న్ మాత్ర‌మే ర‌క‌ర‌కాల చాలెంజింగ్ రోల్స్ చేశాడు. చిరంజీవి త‌న ఇమేజ్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి చంట‌బ్బాయి, స్వ‌యంకృషి, ఆప‌ద్భాంధ‌వుడు చేసినా జ‌నానికి ఎక్క‌లేదు.

ఎన్టీఆర్ కుటుంబ క‌థ‌ల్లో మెప్పించినా , జాన‌ప‌ద , పౌరాణికాలే గుర్తుంటాయి. ANR ప్రేమ చిత్రాలే గుర్తుంటాయి. కృష్ణ కౌబాయ్‌గా , ట్ర‌యాంగిల్ ల‌వ్ హీరోగా శోభ‌న్‌కి ముద్ర‌లు ప‌డ్డాయి.

వ‌య‌సుని, కాలంలో వ‌చ్చే మార్పుల్ని ప్రేక్ష‌కులు గుర్తిస్తారు. కానీ హీరోలే గుర్తించ‌రు. బంగారు మ‌నిషి (1976)లో NTR చేతిలో పుస్త‌కాలు ప‌ట్టుకుని కాలేజీకి వెళితే జ‌నం కెవ్వున కేకేశారు. హీరోగా త‌న‌కి వ‌య‌సై పోయింద‌ని తెలుసుకోలేక కాంతారావు గుండెలు తీసిన మొన‌గాడు (1974) సొంతంగా తీసి డ‌బ్బులు పోగొట్టుకున్నాడు.

ఇప్ప‌టి హీరోల‌కి ఇలాంటి స‌మ‌స్య‌లు త‌క్కువే. ఎందుకంటే వీళ్లు ఏడాదికో రెండేళ్ల‌కో ఒక‌ సినిమానే తీస్తారు. ఇంత గ్యాప్‌లో జ‌నానికి అంత‌కు ముందు సినిమా గుర్తుండ‌దు. 1970 నాటికే NTR 200 సినిమాలు పూర్తి చేశారు. ఇపుడున్న హీరోల్లో ఏ ఒక్క‌రు వంద కూడా పూర్తి చేయ‌లేరు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp