మణిరత్నం ఇళయరాజా : ది ఓన్లీ కాంబో - Nostalgia

By iDream Post Jun. 02, 2021, 08:30 pm IST
మణిరత్నం ఇళయరాజా : ది ఓన్లీ కాంబో - Nostalgia
సినిమా పరిశ్రమలో అపూర్వ కలయిక అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హీరో హీరోయిన్ లేదా దర్శకుడు నిర్మాత ఇలా కాంబినేషన్లలో వరసగా హిట్లు రావడం మామూలే కానీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఆణిముత్యాలకు ఇద్దరు భాగం కావడమనేది మణిరత్నం-ఇళయరాజా గురించి చెప్పుకోవచ్చు. ఇండియన్ సినిమాలో వన్ అఫ్ ది బెస్ట్ కాంబోగా ఈ ద్వయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందులోనూ ఇద్దరి పుట్టినరోజు ఒకేరోజు రావడం కూడా ఈ సృష్టి సంకల్పమేమో. ఈ ఇద్దరూ మొదటిసారి కలిసి పనిచేసిన సినిమా 1983లో వచ్చిన కన్నడ చిత్రం 'పల్లవి అనుపల్లవి'. అనిల్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ అంతగా విజయం సాధించలేదు.

కానీ పాటలు మాత్రం గొప్ప స్పందన దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఐడియా తన సెల్ ఫోన్ నెట్ వర్క్ కోసం ఇందులో ట్యూనే వాడుకుందంటే ఇది ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పాలా. తెలుగులోనూ ఇదే టైటిల్ తో అప్పట్లో డబ్బింగ్ చేశారు. ఆ తర్వాత ఉనరు, పగల్ నిలావు, ఇదయ కోవిల్ లో వచ్చాయి. అసలైన బ్రేక్ మాత్రం 1986లో వచ్చిన 'మౌనరాగం'తో దక్కింది. భార్యభర్తల సంబంధం గురించి మణిరత్నం చేసిన సెల్యులాయిడ్ మేజిక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మల్లెపూల చల్లగాలి పాటను పాడుకోని మ్యూజిక్ లవర్ లేడు. ఆ వెంటనే 1987లో విడుదలైన 'నాయకుడు' సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇప్పటికీ హం చేసుకునేవాళ్ళు ఉన్నారు.

1988లో వచ్చిన 'ఘర్షణ' మరో ఆణిముత్యం. ప్రతి పాట యువతను వెర్రెక్కిపోయేలా చేసింది. రాజా రాజాధి రాజా ఆడియో క్యాసెట్ అరిగిపోయేదాకా వినిపించేది. నిన్ను కోరి వర్ణం ఎందరు అమ్మాయిలకు మంత్రంగా మారిందో చెప్పడం కష్టం. 1989లో గీతాంజలి, 1990లో అంజలి దేనికవే సాటిలేని వజ్రాలు. ఒక్కో పాట గురించి పుస్తకమే రాయొచ్చు. 1991లో వచ్చిన మల్టీ స్టారర్ 'దళపతి' రేపిన సంచలనం గురించి చెప్పుకుంటే రోజులు చాలవు. చిలకమ్మా చిటికేయంగా, సింగారాలు పైరుల్లోనా ఒకటా రెండా అన్ని పాటలు వెలలేని వైఢూర్యాలు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఈ కాంబో ఆగిపోయింది. రోజా నుంచి ఏఆర్ రెహమాన్ తో జట్టు కట్టాక మణిరత్నం మళ్ళీ రాజాతో కలవనేలేదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp