యువత భావాలకు వెండితెర రూపం - Nostalgia

By iDream Post Sep. 19, 2021, 09:00 pm IST
యువత భావాలకు వెండితెర రూపం - Nostalgia

దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో నిరుద్యోగం చేస్తున్న ప్రయాణం ఇప్పటిది కాదు. దశాబ్దాల నాటిది. 1990 తర్వాత అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక మంత్రి మన్ మోహన్ సింగ్ తెచ్చిన సంస్కరణలు ప్రైవేటీకరణకు విదేశీ పెట్టుబడులకు దారులు సుగమం చేసి ఉపాధి అవకాశాలు పెంచాయి కానీ లేదంటే పరిస్థితి ఊహించుకోవడానికే భయపడేంత దారుణంగా ఉండేది. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ ప్రతి ఒక్కరికి జాబు ఇవ్వలేదు. కానీ దీనికి ముందు అంటే 70, 80 దశకంలో మాత్రం అన్ ఎంప్లాయ్ మెంట్ చాలా తీవ్రంగా ఉండేది. అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేక యువకులు గగ్గోలు పెడుతున్న సమయమది.

Also Read: ఎవరూ అనుకరించలేని విలక్షణ ఉపేంద్ర - Nostalgia

దీన్నే కథా వస్తువుగా తీసుకుని దర్శకులు కె బాలచందర్ ఆవిష్కరించిన మాస్టర్ క్లాసిక్ ఆకలి రాజ్యం. 1979లో ఈ దిగ్గజ దర్శకుడు రూపొందించిన రెండు తెలుగు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఒకటి గుప్పెడు మనసు. రెండు ఇది కథ కాదు. కమల్-చిరంజీవి కాంబోలో వచ్చిన ఒకే చిత్రమిది. ఆ సమయంలో దేశంలో ఏర్పడ్డ ఆర్ధిక అనిశ్చితి వల్ల చదువు పూర్తి చేసుకున్న కుర్రాళ్ళు నిరాశతో ఆత్మహత్యలు చేసుకోవడం పేపర్ లో చదివిన బాలచందర్ మనసులో మెదిలిన ఆలోచనలకు ప్రతిరూపమే ఆకలి రాజ్యం. శిష్యుడు కమల్ హాసన్ మరోసారి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా చాలా తక్కువ బడ్జెట్ లో దీన్ని రూపొందించారు.

Also Read: ఛాలెంజింగ్ పాత్రల మేలు కలయిక రమ్యకృష్ణ - Nostalgia

ఇందులో రంగా పాత్రలో కమల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. హిపోక్రసీ లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తితో సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించాలనే తత్వం అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం స్లో పాయిజన్ లా ఎక్కేసింది. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, కన్నెపిల్లవని కన్నులున్నవని పాటలు ఇప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాలు. గణేష్ పాత్రో సంభాషణలు తూటాల్లా పేలాయి. తమిళంలో వరుమయిం నిరం శివప్పు పేరుతో ఒకేసారి నిర్మాణం జరుపుకున్న ఆకలిరాజ్యం రెండు నెలలు ఆలస్యంగా తెలుగులో 1981 జనవరి 9న విడుదలై గొప్ప విజయం సాధించింది.

Also Read: పల్లెటూరి నేపథ్యంలో పసందైన డ్రామా - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp