నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా - Nostalgia

By iDream Post Apr. 08, 2021, 08:30 pm IST
నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా - Nostalgia

అనుకుంటాం కానీ సినిమాల్లో హాస్యం పండించడం అందులోనూ సెన్సిబుల్ కామెడీ కత్తి మీద సాము లాంటిది. 90ల ప్రాంతంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు ఈ విషయంలో తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఈవివి సత్యనారాయణ సైతం ఎన్నో మంచి చిత్రాలు అందించినప్పటికీ కమర్షియల్ ఫ్లేవర్ కోసం కొన్ని చిత్రాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు జొప్పించడం కొంత స్థాయిని తగ్గించిన మాట వాస్తవం. వీళ్ళ దారులు వేరే ఉన్నా ఫైనల్ గా అందరి స్కూల్ ఒకటే. అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి విలక్షణ దర్శకుడి నుంచి ఈ తరహా మూవీని ఆశించగలమా. అలాంటి విచిత్రం 1996లో జరిగింది. అదే అనగనగా ఒక రోజు.

'గాయం' లాంటి రౌడీ మాఫియా డ్రామాతో అద్భుత విజయం సాధించాక వర్మకు 'గోవిందా గోవిందా' రూపంలో గట్టి దెబ్బే తగిలింది. దీంతో కొంత కాలం బ్రేక్ తీసుకుని బాలీవుడ్ వెళ్ళిపోయి 'రంగీలా'తో చరిత్ర సృష్టించారు. ఇక ముంబైలోనే సెటిలైపోతానని అప్పట్లో స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ తన బ్యానర్ మీద టాలీవుడ్ లో నిర్మాణాలు కొనసాగిస్తానని చెప్పేవారు. అందులో భాగంగా కృష్ణవంశీకి ఇచ్చిన ప్రాజెక్టే ఈ సినిమా. అయితే షూటింగ్ మొదలయ్యాక కొంత భాగం తీశాక ఏవో కారణాల వల్ల రషెస్ చూసిన వర్మకు నమ్మకం కలగలేదు. దీంతో ఆ బాధ్యతను తాను నెత్తిమీద వేసుకుని కృష్ణవంశీకి 'గులాబీ' సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు.

వర్మ చేతికి వచ్చాక రచయిత నడిమింటి నరసింగరావుతో కలిసి కొన్ని కీలక మార్పులు చేశారు. క్రైమ్ డ్రామాను మెయిన్ ప్లాట్ గా తీసుకుని పాతిక శాతం సీరియస్ గా ముప్పాతిక భాగం హాయిగా నవ్వుకునేలా స్క్రీన్ ప్లే సెట్ చేశారు. మనీకి మించిన పేరు రావాలనే ఉద్దేశంతో బ్రహ్మానందం కోసం డిజైన్ చేసిన మైకేల్ జాక్సన్ క్యారెక్టర్ అద్భుతంగా పేలింది. నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అంటూ పోలీసుల దగ్గర ఆయన పలికే సంభాషణలు, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ఇప్పటికీ సోషల్ మీడియా మేమ్స్ లో వాడుతూనే ఉంటారు. జెడి చక్రవర్తి-ఊర్మిళ జంట, శ్రీ ఇచ్చిన చక్కని పాటలు ప్లస్ బీజీఎమ్, అనుభవజ్ఞులైన నటీనటులు అనగనగా ఒక రోజుని సూపర్ హిట్ చేశాయి. మనసారా నవ్వుకుంటూ థ్రిల్స్ ని ఎంజాయ్ చేయాలంటే ఇప్పకీ ఈ సినిమాని బెస్ట్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp