తడబడిన లవ్ ఎంటర్ టైనర్ - Nostalgia

By iDream Post Jul. 21, 2021, 07:00 pm IST
తడబడిన లవ్ ఎంటర్ టైనర్ - Nostalgia

అంచనాలు ఉండే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు ఎమోషన్స్ ఎంత ముఖ్యమో అభిమానులు ఆశించే వాటిని సరిగ్గా పొందుపరచడం కూడా అంతకన్నా ముఖ్యం. ఈ కొలతలు సరిపోయినప్పుడే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ దక్కుతుంది. లేదా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పాడుకోవాల్సిందే. 2003లో 'గంగోత్రి'తో పరిచయమైన అల్లు అర్జున్ డెబ్యూతోనే వంద రోజుల బొమ్మను ఖాతాలో వేసుకున్నప్పటికీ అసలైన కిక్ ఇచ్చింది మాత్రం 2004లో రిలీజైన 'ఆర్య'. దాంతోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నటనలోని ఈజ్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. 2005లో వచ్చిన 'బన్నీ'తో తనకు మాస్ ఫాలోయింగ్ వచ్చి పడింది.

ఆ టైంలో అల్లు అర్జున్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వల్ల దర్శకులు వాళ్ళను టార్గెట్ చేసి కథలను సిద్ధం చేసేవారు. ఆ క్రమంలో కలిసిన వ్యక్తే కరుణాకరన్. పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'తో సెన్సేషన్ సృష్టించిన ఈ యువదర్శకుడు ఆ తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేదు. 'యువకుడు' నిరాశ పరచగా, 'వాసు' యావరేజ్ గా నిలిచిపోయింది. పవన్ మళ్ళీ పిలిచి ఛాన్స్ ఇస్తే కమర్షియల్ సబ్జెక్టుని డీల్ చేయలేక 'బాలు' రూపంలో ఫ్లాప్ అందుకున్నాడు.ఇలా లాభం లేదని మళ్ళీ తన స్కూల్ ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని 2004లో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన 'అజగియ తీయ'ను స్ఫూర్తిగా తీసుకున్నారు కరుణాకరన్

ఆ సినిమా స్క్రిప్ట్ తయారు చేసిన రాధామోహన్ ఇచ్చిన పాయింట్ ఆధారంగా రైటర్ స్వామి, సంభాషణల రచయిత కోన వెంకట్ సహాయంతో హ్యాపీని రాసుకున్నారు కరుణాకరన్. ఒకరంటే ఒకరికి పడని హీరో హీరోయిన్ల మధ్య ఎంటర్ టైనింగ్ డ్రామాని ఇందులో పొందుపరిచారు. జెనీలియా హీరోయిన్ గా ఎంపిక కాగా యువన్ శంకర్ రాజా అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా నడిచిన మూవీ సెకండ్ హాఫ్ లో తడబడటంతో అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. 2006 జనవరి 27 రిలీజైన హ్యాపీ అభిమానులకు సంతృప్తినిచ్చినా ఫైనల్ గా యావరేజ్ కు ఓ మెట్టు పైన నిలిచింది. ఇక్కడ మనోజ్ బాజ్ పేయ్ పోషించిన పాత్రలు పోలిన క్యారెక్టర్ ని తమిళ్ లో ప్రకాష్ రాజ్ పోషించగా అక్కడ హీరోగా ప్రసన్న నటించారు.

Also Read: లారీ డ్రైవర్ రాజారామ్ మాస్ అల్లరి - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp