ఎర్రజెండా పట్టుకున్న కలెక్షన్ కింగ్ - Nostalgia

By iDream Post Jan. 18, 2021, 08:43 pm IST
ఎర్రజెండా పట్టుకున్న కలెక్షన్ కింగ్ - Nostalgia

ఏదైనా ఒక సినిమా లేదా ఒక జానర్ ట్రెండ్ సెట్ చేసినప్పుడు అందరూ దాన్ని ఫాలో కావడం ఇండస్ట్రీలో సాధారణం. పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ అయ్యాక ఆ ట్రెండ్ లో ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. అన్నమయ్య వచ్చాక ఆ సినిమా ఫలితం చూసి భక్తి చిత్రాలతో ఎంతమంది చేతులు కాల్చుకున్నారో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఫ్యాక్షన్ బ్యాచ్ అయితే మరీ ఎక్కువ. సమరసింహారెడ్డి చూపించిన దారి ఏళ్లతరబడి స్టార్ డైరెక్టర్లు కూడా ఫాలో అయ్యారు. ప్రేక్షకులు చాలు బాబోయ్ అని చెప్పేదాకా ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఆ మధ్య రెడీతో శ్రీను వైట్ల తీసుకొచ్చిన ఫార్ములా ఇప్పటి అల్లుడు అదుర్స్ దాకా కొనసాగినట్టు.

ఇక అసలు విషయానికి వద్దాం. 1994లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి 'ఎర్ర సైన్యం'తో సాధించిన ఘనవిజయం ఎందరినో ఆలోచనలో పడేసింది. ఇలాంటి సినిమాలు కేవలం ఒకవర్గానికి మాత్రమే నచ్చుతాయన్న అంచనాలను బద్దలు కొడుతూ ఎర్ర సైన్యం అన్నివర్గాలతోనూ శభాష్ అనిపించుకుని తెరమీద ఒక కొత్త విప్లవానికి దారి తీసింది. దీంతో ఈ ధోరణిని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో మిగిలినవాళ్లు కూడా ఇదే తరహా కథలు చేయడం మొదలుపెట్టారు. ఒసేయ్ రాములమ్మ విజయం దీనికి మరింత ఊతమిచ్చింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం ఎర్ర జెండా పట్టుకున్నారు.

1997లో బి గోపాల్ దర్శకత్వంలో స్వంత బ్యానర్ మీద అడవిలో అన్న ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మాస్, ఫ్యామిలీ, కమర్షియల్ సినిమాలు చేస్తున్న మోహన్ బాబు దీన్ని ఎంచుకోవడం పట్ల సీనియర్లు సైతం షాక్ అయ్యారు. ఆయన డ్యూయల్ రోల్ లో రోజా హీరోయిన్ గా వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించారు. పరుచూరి సోదరులు చాలా శక్తివంతమైన సంభాషణలు సమకూర్చారు. మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ కీలక పాత్ర చేశాడు. జనవరి 10న సినిమా విడుదలైంది. అదే రోజు విడుదలైన పెద్దన్నయ్య, వారం ముందు వచ్చిన హిట్లర్ పోటీని తట్టుకుని మూడో స్థానంలో నిలిచింది. రైతు సమస్యలకు నక్సలిజం కాన్సెప్ట్ ని జోడించి చూపించిన తీరు కమర్షియల్ సక్సెస్ ని అందించింది. ఆలోచింపజేసేలా ఇందులో చాలా సన్నివేశాలు ఉంటాయి. పాటలు బాగా హిట్టయ్యాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp