ఆయనకు ఇద్దరు మెచ్చారు అందరు - Nostalgia

By iDream Post Nov. 21, 2020, 10:24 pm IST
ఆయనకు ఇద్దరు మెచ్చారు అందరు - Nostalgia

ఇద్దరి భామల మధ్య నలిగిపోయే కథానాయకుడి పాత్రలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులోనూ తెలుగులో చూసుకుంటే శోభన్ బాబు, జగపతిబాబు కోసమే ప్రత్యేకంగా ఇలాంటి కథలు రాసుకునేవాళ్ళు. రెండో పెళ్ళాం స్టోరీతో వెంకటేష్ లాంటి స్టార్లు సైతం హిట్లు కొట్టారు. కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొంది ప్రేక్షకుల మెప్పుతో వసూళ్లు రాబట్టిన మంచి సినిమాగా 1995లో విడుదలైన ఆయనకు ఇద్దరు గురించి చెప్పుకోవచ్చు. 1993లో యష్ చోప్రా నిర్మాతగా దీపక్ సరీన్ దర్శకత్వంలో 'ఐనా' అనే బాలీవుడ్ మూవీ వచ్చింది. జాకీ షరాఫ్ హీరోగా, అమృతా సింగ్, జుహీ చావ్లా హీరోయిన్లుగా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. నెగటివ్ రోల్ లో అద్భుతంగా మెప్పించిన అమృతా సింగ్ కు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది.

ఐనాలోని మెయిన్ పాయింట్ తీసుకుని ఇక్కడి ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో తులసి అన్నపూర్ణ బ్యానర్ పై జగపతిబాబు, రమ్యకృష్ణ, ఊహ ప్రధాన పాత్రల్లో 'ఆయనకు ఇద్దరు' నిర్మించారు. శుభలగ్నం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ టైంలో జగపతిబాబుని వరస పరాజయాలు పలకరించాయి. తీర్పు, చిలకపచ్చ కాపురం, భలే బుల్లోడు, సంకల్పం ఒకదాన్ని మించి మరొకటి దెబ్బేశాయి. అప్పుడు వచ్చిందే ఆయనకు ఇద్దరు. నవల రచయిత అయిన సూర్య(జగపతిబాబు) తన అభిమాని ఊహ(ఊహ)ని బదులు పొరబడి ఆమె అక్క రమ్య(రమ్యకృష్ణ) ను ప్రేమిస్తాడు. కానీ సినిమా వేషాల పిచ్చిలో పడ్డ ఆమె అతన్ని వదిలేసి వెళ్తుంది. దీంతో ఆ స్థానంలో భార్యగా ఊహ సూర్య జీవితంలో ప్రవేశిస్తుంది.

పరిశ్రమలో మోసపోయి అక్కయ్య వెనక్కు తిరిగివస్తుంది. ఈలోగా అంతా జరిగిపోవడంతో సూర్య తనకే చెందాలని పంతం పడుతుంది. కథ రసవత్తరంగా మారుతుంది. ఏదైనా తనకే కావాలనే విపరీత మనస్తత్వం కలిగిన రమ్యకు సూర్య ఎలా బుద్ది చెప్పాడు అనేదే క్లైమాక్స్. టైటిల్ మొదట్లో వివాదం రేపింది. ఆయనకు ఇద్దరా అని మార్చాల్సి వచ్చింది. తర్వాత కాలక్రమంలో మొదటికే మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. సెంటిమెంట్ కామెడీ మిక్స్ చేసి ఈవీవీ తీర్చిదిద్దిన తీరుకు కోటి అద్భుతమైన పాటలు తోడవ్వడంతో జగపతిబాబుకి మరో వందరోజుల బొమ్మ వచ్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇందులో ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. బ్రహ్మానందం, ఏవిఎస్, కోటల మధ్య నడిచే అప్పు ఇచ్చిపుచ్చుకునే కామెడీ ఇప్పటికీ బెస్ట్ అని చెప్పొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp