ఇంత త్వరగా డిజిటిల్ రిలీజా

By iDream Post Apr. 08, 2021, 12:33 pm IST
ఇంత త్వరగా డిజిటిల్ రిలీజా

కర్ణాటకలో థియేటర్ల సీట్లను యాభై శాతానికి కుదించిన తాలూకు పరిణామాలు అప్పుడే ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ఈ నెల 1వ తేదీన భారీ ఎత్తున విడుదలైన యువరత్న అతి తక్కువ సమయంలో ఓటిటిలో రాబోతోంది. కేవలం 8 రోజుల రన్ పూర్తి చేసి రేపు అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం. కన్నడ, హిందీలతో పాటు తెలుగులోనూ ప్రసారం కాబోతోంది. ఇలా ఇంత తక్కువ గ్యాప్ లో ఈ సినిమా రావడం ఎవరూ ఊహించనిది. ఇక్కడ విపరీతమైన పోటీతో పాటు పునీత్ రాజ్ కుమార్ పరిచయం లేని మొహం డిజాస్టర్ కు కారణమయ్యాయి కానీ కన్నడనాట దీనికి మంచి వసూళ్లు దక్కాయి.

గతంలో విజయ్ మాస్టర్ ని అమెజాన్ ప్రైమ్ ఇలాగే కేవలం రెండు వారాల గ్యాప్ తో రిలీజ్ చేసినప్పుడు ట్రేడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. అయినా కూడా నిర్మాతలు వెనుకడుగు వేయలేదు. కానీ విజయ్ కున్న అశేషమైన ఫాలోయింగ్ వల్ల దాని ప్రభావం మరీ తీవ్రంగా పడలేదు. తెలుగులోనూ గట్టి కలెక్షన్లు వచ్చి పడ్డాయి. కానీ యువరత్న కేసు వేరు. పునీత్ కు స్వంత భాషలో భారీ అభిమానులు ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల ఇతని గురించి తెలిసింది చాలా తక్కువ. పైగా తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా దెబ్బ కొట్టడంతో బయ్యర్లు కూడా నష్టపోయారు. దీంతో డిజిటల్ రిలీజ్ డేట్లో అనూహ్య మార్పులు జరిగాయని తెలిసింది.

చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి సెన్సేషన్లు వస్తాయో చూడాలి. థియేటర్లు తెరిచాక ఓటిటి చల్లారింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఊపందుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణలో 50 శాతం నిబంధనను ఏప్రిల్ 15 నుంచి తెస్తారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. హీరో ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మరీ బ్రహ్మాండంగా ఉందనే టాక్ వస్తే రెండు మూడు రోజుల తర్వాత జనం హాల్ దగ్గరకు రావడం లేదు. అలాంటిది యువరత్న లాంటి మూవీస్ కి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యువరత్న ఆడకపోయినా ఇంట్లో కాలక్షేపానికి ట్రై చేయొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp