పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్

By Ravindra Siraj Feb. 05, 2020, 10:28 am IST
పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్

మనకు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే పరిచయమైనా కమెడియన్ గా తమిళనాడులో యోగిబాబుకి స్టార్ స్టేటస్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కోకోకోకిల మొదలుకుని విజిల్, దర్బార్ దాకా ప్రతిదాంట్లో తప్పనిసరిగా కనిపించే యోగి ఫైనల్ గా ఓ ఇంటివాడయ్యాడు. వేలూరు కు చెందిన మంజు పార్కవిని పెళ్లి చేసుకున్నాడు. తిరుత్తణిలోని తమ పూర్వీకుల గుడిలో పెద్దగా హడావిడి చేయకుండా యోగిబాబు వివాహాన్ని పూర్తి చేసుకున్నాడు.

మార్చ్ లో చెన్నై వేదికగా గ్రాండ్ రిసెప్షన్ ఇస్తానని ప్రకటించాడు. కోలీవుడ్ అతిరధ మహారథులంతా ఆ వేడుకకు వచ్చే అవకాశం ఉంది. నటనకు రూపానికి సంబంధం లేదని రుజువు చేసిన వాళ్ళలో యోగి బాబుని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. భారీ కాయం, నల్లని రంగు, చూడగానే ఏ కోశానా ఆకట్టుకునే అంశాలు లేని యోగిబాబు కేవలం తన టాలెంట్ తోనే అతి తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారాడు.

చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో తమ సినిమాలో ఉండాల్సిందే అని యోగిబాబుని కోరుకుంటున్నారంటే దాన్ని బట్టి ఇతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల్లో సోలో హీరోగా నటించి షాక్ ఇచ్చిన యోగిబాబు వాటిలో హిట్స్ కూడా అందుకున్నాడు. ఒకప్పుడు తెలుగులో బాబూమోహన్ ఎంజాయ్ చేసిన స్థాయిని మించి యోగిబాబు అక్కడ దూసుకుపోతున్నాడు. వాస్తవానికి యోగిబాబుని తెలుగు స్ట్రెయిట్ సినిమాల ద్వారా పరిచయం చేయాలని మన దర్శకులు కొందరు ప్రయత్నించారు కానీ కాల్ షీట్స్ దొరకక ఆ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యోగిబాబు పెళ్లి టాపిక్ ట్రెండింగ్ లో ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp