సాయి తేజ్ సినిమా విడుదలకు మార్గం ?

By iDream Post Jun. 02, 2021, 05:30 pm IST
సాయి తేజ్ సినిమా విడుదలకు మార్గం ?
సమీప కాలంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాక నిర్మాతల పరిస్థితి గందరగోళంగా ఉంది. రిలీజ్ కు సిద్ధమవుతున్న సినిమాల లిస్టు అంతకంతా పెరుగుతూ పోతోంది. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా కనీసం వారానికి అయిదారు విడుదల చేయాల్సిన ఇబ్బంది ఎదురు చూస్తోంది. దీని వల్ల పోటీ పెరిగి ఓపెనింగ్స్ ప్రభావితం చెందడమే కాక యావరేజ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు తీవ్ర నష్టాలు తప్పవు. అందుకే ఏం చేయాలో పాలుపోని స్థితిలో దేవుడి మీద భారం వేసి ఎదురు చూస్తున్నవాళ్ళే ఎక్కువ. పెట్టుబడుల భారం అంతకంతా పెరుగుతూ పోతున్నా తట్టుకుంటున్నారు. ఇది ఎప్పటిదాకా అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

అందుకే కొందరు ప్రొడ్యూసర్లు ప్రత్యాన్మయ మార్గాలు వెతుకుతున్నారు. ఇటీవలే జీ సంస్థ సల్మాన్ ఖాన్ రాధే ని పే పర్ వ్యూ మోడల్ లో ఓటిటి రిలీజ్ చేస్తే బాగానే వర్క్ అవుట్ చేసుకుంది. డిజాస్టర్ అయ్యింది కానీ ఒకవేళ హిట్ టాక్ కనక వచ్చి ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు జరిగేవి. అందుకే తమ కంటెంట్ మీద నమ్మకం ఉన్న నిర్మాతలు మరోసారి ఈ మోడల్ మీద కన్నేసినట్టు ఇన్ సైడ్ టాక్. దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందిన రిపబ్లిక్ ని ఈ మోడల్ లో ఇండియాలో ఓటిటి, బయట దేశాల్లో థియేటర్లో రిలీజ్ చేసే ప్రతిపాదనని జీ సంస్థ నిర్మాత బివిఎన్ఎస్ ప్రసాద్ ముందు ఉంచినట్టు తెలిసింది.

ఒకవేళ ఇది నిజమైతే ఈ తరహాలో విడుదలైన మొదటి సినిమాగా రిపబ్లిక్ నిలిచిపోతుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఖచ్చితంగా చెప్పలేం. గత ఏడాది కూడా సోలో బ్రతుకే సో బెటరూని ఇలాగే ప్లాన్ చేసుకున్న జీ ప్లెక్స్ ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని  థియేటర్లో వదిలింది. పది రోజుల తర్వాత పే పర్ వ్యూ మోడల్ లో ప్రేక్షకులకు ఇచ్చింది. ఇప్పుడు రెండూ ఒకేసారి చేయాలన్న ప్రపోజల్ లో ఉంది. మరి సాయి తేజ్ ఏమంటాడో వేచి చూడాలి. ఏది ఏమైనా కొంతకాలం ఇలాంటి నిర్ణయాలు తప్పేలా లేవు. కరోనా కేసులు తగ్గినా జనంలో భయం ఇంకా ఉంది కాబట్టి థియేటర్లకు మంచి రోజులు వచ్చేందుకు టైం పడుతుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp