మహేష్ బాబుతోనే బోణీ మొదలు

By iDream Post May. 21, 2020, 12:03 pm IST
మహేష్ బాబుతోనే బోణీ మొదలు

లాక్ డౌన్ వేళ షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతబడి సినిమా పరిశ్రమ అస్తవ్యస్తమవుతున్న వేళ త్వరలోనే పూర్వస్థితి వస్తుందని ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులూ కోరుకుంటున్నారు. ఈ రోజు దీనికి సంబంధించి ఓ కీలమైన సమావేశం చిరంజీవి ఇంట్లో దర్శక నిర్మాతలతో పాటు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన జరగబోతున్నట్టు తెలిసింది. ఇందులోనే విధి విధానాలు రూపొందించి త్వరలోనే ప్రకటిస్తారట. అయితే బోణీ మాత్రం మహేష్ బాబు చేయబోతున్నట్టు సమాచారం.

మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి ఆ రోజే ప్రారంభోత్సవం చేయబోతున్నట్టు తెలిసింది. అప్పటికి ఇంకా నిబంధనలు అమలులో ఉంటాయి కాబట్టి పరిమిత సంఖ్యలో గెస్టులతో పాటు అభిమానులను ఎవరిని అనుమతించబోరట. టాలీవుడ్ వరకు అఫీషియల్ గా లాక్ డౌన్ తర్వాత మొదలుకాబోతున్న సినిమా ఇదే అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి చేస్తారనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. హీరోయిన్ గా కియారా అద్వానీనే ఫైనల్ అయినట్టు చెబుతున్నారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కొన్ని రోజులు కీర్తి సురేష్ పేరు కూడా చక్కర్లు కొట్టింది. తర్వాత ఎలాంటి చప్పుడు లేదు.

ఈ ప్రాజెక్ట్ ని మహేష్ బాబు స్వంత సంస్థతో పాటు మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తారట. సరిలేరు నీకెవ్వరుకు కూడా ఇదే ఫార్ములా వాడారు. అందరికి గతంలో ఇచ్సిన మాట కావడంతో విడివిడిగా పూర్తి చేయలేక ప్రిన్స్ ఇలా జాయింట్ కమిట్ మెంట్ ఇస్తున్నాడు. సంగీత దర్శకుడిగా గోపి సుందర్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళలో ఒకరు ఫైనల్ అవుతారు. పరశురామ్ గోపి వైపు ఉండగా మహేష్ లేటెస్ట్ సెన్సేషన్ తమన్ ని ప్రిఫర్ చేస్తున్నట్టు తెలిసింది. ఓపెనింగ్ రోజే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఇంకో 9 రోజులు వెయిట్ చేయాలి అంతే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp