దృశ్యం మేజిక్ రిపీట్ అవుతుందా

By iDream Post May. 21, 2020, 04:31 pm IST
దృశ్యం మేజిక్ రిపీట్ అవుతుందా

విక్టరీ వెంకటేష్ హీరోగా 2014లో వచ్చిన దృశ్యం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఒరిజినల్ వెర్షన్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేరళలో మొట్టమొదటి సారి 50 కోట్ల వసూళ్లు దాటించిన సినిమాగా ఇది సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. దృశ్యం తర్వాతే మల్లు వుడ్ స్టాండర్డ్ అంతకు రెండింతలు పెరిగింది. వంద కోట్ల దాకా మార్కెట్ ఎక్స్ పాండ్ అయింది. తప్పు చేసిన కుర్రాడిని అనుకోకుండా హత్యచేయాల్సిన వచ్చిన తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు అనే పాయింట్ తో దర్శకుడు జీతూ జోసెఫ్ చూపించిన విధానం ప్రేక్షకులకు ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యింది.

రీమేక్ వెర్షన్ ని శ్రీప్రియ హ్యాండిల్ చేసిన తీరు క్రిటిక్స్ ని సైతం మెప్పించింది. అయితే తెలుగు దృశ్యం వసూళ్ల పరంగా గొప్ప అద్భుతాలు చేయలేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పుని పొంది సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ్ లో కమల్ హాసన్, కన్నడలో రవిచంద్రన్, హిందీలో అజయ్ దేవగన్ చేసిన రీమేకులు సైతం మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడీ దృశ్యంకు సీక్వెల్ వస్తోంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దీన్ని కొనసాగించబోతున్నారు. ఇవాళ లాల్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది టీమ్. విడుదలకు చాలా టైం పట్టేలా ఉంది. దీనికన్నా ముందు ఈ ఇద్దరూ మరో సినిమా కూడా చేస్తున్నారు.

దీని సంగతలా ఉంచితే దృశ్యం 2ని తెలుగులో కూడా తీస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వెంకీ అసలే ఫుల్ జోష్ లో ఉన్నాడు. తను తప్ప వేరొకరికి సూట్ కానీ పాత్ర అది. ఫస్ట్ పార్ట్ లాగే దీన్ని కూడా మంచి థ్రిల్స్ తో నింపబోతున్నారట. అయితే కొనసాగింపుగా ఉంటుందా లేదా అనేది తెలియదు. దృశ్యంలో హంతకుడి శవాన్ని పోలీస్ స్టేషన్ లోనే సమాధి పెట్టి పూడ్చేసిన సంగతి ఎవరికి తెలియకుండా హీరో బయటపడిపోతాడు. ఇక్కడి నుంచి కంటిన్యూ చేయడానికి మంచి స్కోప్ ఉంది. కాకపోతే ఆ వివరాలేవీ యూనిట్ బయట పెట్టడం లేదు. అన్ని కుదిరితే దృశ్యం 2లో వెంకీ మరోసారి టీనేజర్ అమ్మాయి తండ్రిగా చూడొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp