బన్నీ నిర్ణయం మార్చుకున్నాడా

By iDream Post Jun. 12, 2020, 02:19 pm IST
బన్నీ నిర్ణయం మార్చుకున్నాడా

ఉన్నట్టుండి కొరటాల శివ-అల్లు అర్జున్ ల ప్రాజెక్ట్ గురించిన వార్తలు నిన్నటి నుంచి తెగ ప్రచారంలోకి వచ్చాయి . ఇంకా పుష్ప షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేయనే లేదు. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. విడుదల తేదీ గురించి అసలే క్లారిటీ లేదు. ఇది పూర్తయితే కానీ బన్నీ ఇంకో కొత్త సినిమా గురించి ఆలోచించడు. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ పెండింగ్ ఉంది . వకీల్ సాబ్ టేకప్ చేసిన వేణు శ్రీరామ్ దర్శకుడు. ఆ మధ్య బన్నీ పుట్టినరోజుకి ఈ టీం నుంచి విషెస్ చెబుతూ పోస్టర్ కూడా వచ్చింది. ఇది కూడా పూర్తవ్వాలంటే ఎంత లేదన్నా 2021 ఆఖరు అవుతుంది. మరి అప్పటిదాకా కొరటాల శివ వెయిట్ చేస్తాడా అనేది వేచి చూడాలి.

ఎందుకంటే ఆచార్య ఈ ఏడాది చివరిలోపు పూర్తవుతుంది. ఇప్పటికే దీని మీద తన మూడేళ్ళ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టారు శివ. వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి. ఒకవేళ అల్లు అర్జున్ మాట ఇచ్చిందే నిజమైతే ఐకాన్ ని పెండింగ్ పెట్టినట్టు అనుకోవాలి. లేదూ ఐకాన్ నే హోల్డ్ లో పెట్టారా అనేది ఒక్క బన్నీకే తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొరటాల శివ ఎక్కువ జాప్యం జరగాలని కోరుకోడు. అల్లు అర్జున్ పుష్ప అవ్వగానే డేట్స్ ఇస్తే సమస్య లేదు. అప్పుడు ఐకాన్ ఇంకొంత కాలం వాయిదా పడుతుంది.

ఇదంతా తేలాలంటే బన్నీనే చెప్పాలి. కేరళలో ప్లాన్ చేసిన పుష్ప షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ చేసిన టీం కొన్నిరోజులు పరిస్థితిని చూసి ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని గోదావరి జిల్లాలకు షిఫ్ట్ కాబోతున్నాయి. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోనూ కొంత భాగం ప్లాన్ చేశారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా బన్నీ ఇందులో విభిన్న పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్ర అన్నారు కాని కాల్ షీట్స్ సమస్య వల్ల తప్పుకున్నాడన్న టాక్ ఉంది. మొత్తానికి వేణు శ్రీరామ్-కొరటాల శివలలో ఎవరు ముందు అనే దానితో పాటు పుష్పకు సంబంధించిన కీలక అప్ డేట్ కూడా యూనిట్ నుంచి రావాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టేలా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp