సమంతా సరసన దుష్యంతుడు ఎవరు

By iDream Post Jan. 22, 2021, 03:38 pm IST
సమంతా సరసన దుష్యంతుడు ఎవరు

భారీ బడ్జెట్ తో పాటు అత్యధిక స్థాయిలో ఆర్టిస్టులు అవసరం ఉన్న హిరణ్యకశిపను తాత్కాలికంగా పక్కనబెట్టిన దర్శకుడు గుణశేఖర్ ఆ మధ్య శాకుంతలం సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ లో సమంతా నటిస్తుండగా దుశ్యంతుడు ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయడంతో పాటు సెట్లు ప్రత్యేక శ్రద్ధతో వేయిస్తూ ఆర్ట్ వర్క్ ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు గుణశేఖర్. అసలు ఇప్పటి తరానికి శకుంతల కథను చెప్పాలనుకోవడం సాహసమే. రుద్రమదేవి ఇచ్చిన స్ఫూర్తితో బహుశా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు కాబోలు.

అయితే సామ్ కి జోడీని సెట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది స్టార్ బేస్డ్ కమర్షియల్ సినిమా కాదు. పైగా టైటిల్ రోల్ సమంతా మీదే ఉంది. దుశ్యంతుడికి కథ ప్రకారం ప్రాధాన్యత ఎంత ఉన్నా స్టోరీ శకుంతల కోణంలోనే ఉంటుంది కాబట్టి స్టార్ హీరోలు అంత ఈజీగా ఒప్పుకునే అవకాశాలు లేకపోవచ్చు. గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్, రానా అంటూ ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అవేవి నిజం కాదని గుణశేఖర్ కొట్టి పారేస్తున్నాడు. అసలు ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని ఇంకా పరిశీలన దశలోనే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. అధికారికంగా చెప్పేదాకా వేచి చూడాల్సిందే.

బహుశా తమిళం లేదా బాలీవుడ్ నుంచి ఎవరైనా ఆర్టిస్టును తీసుకునే ఛాన్స్ ఉంది. ఎలాగూ పాన్ ఇండియా ప్రొడక్షన్ కాబట్టి క్యాస్టింగ్ విషయంలో అన్ని బాషల వాళ్ళను పరిగణనలోకి తీసుకోవాలి. మణిశర్మ సంగీతం అందిస్తున్న శాకుంతలం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది. తారాగణం మొత్తం ఫైనల్ అయ్యాక అప్పుడు డిసైడ్ చేయబోతున్నారు. సామ్ ప్రస్తుతం తన మొదటి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న సమంతా తెలుగులో ఒప్పుకున్న మూవీ శాకుంతలం ఒక్కటే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp