సముద్రంలో రెండో హీరో ఎవరు

By iDream Post Apr. 27, 2020, 11:22 am IST
సముద్రంలో రెండో హీరో ఎవరు

రెండేళ్ల క్రితం వచ్చిన ఆరెక్స్ 100 ఊహించని విధంగా సంచలన విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ వల్లే ఎన్ని ఫ్లాపులు వచ్చినా హీరో కార్తికేయకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంది. దర్శకుడు అజయ్ భూపతి వెనుక అగ్ర నిర్మాతలు సైతం వెంటపడే పరిస్థితి నెలకొంది. కాని అనూహ్యంగా ఈ డైరెక్టర్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకానే లేదు. మహాసముద్రం పేరిట ఫుల్ స్క్రిప్ట్ ని చేతిలో ఉంచుకుంది క్యాస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు శర్వానంద్ ఫిక్స్ అయిపోగా రెండో స్టార్ ఎవరనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు గట్టిగానే వినిపించింది కాని ఇప్పటికైతే అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ లేదు. శర్వా సైతం తానుగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు ఇంకా. ఒకదశలో నాగ చైతన్యను ఒప్పించేందుకు గట్టి ప్రయత్నమే జరిగిందని వినిపించింది. సమంతా సైతం కథ పట్ల ఆసక్తి చూపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. అయితే ఆ తర్వాత ఎలాంటి చడీచప్పుడు లేదు. కరోనా వల్ల ఇంకో రెండు మూడు నెలల పాటు కొత్త సినిమా అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ నేపధ్యంలో మహా సముద్రం ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కష్టం. స్క్రిప్ట్ అయితే సిద్ధంగానే ఉంది కాని క్యాస్టింగ్ తో సమస్యల వల్ల ఇది ఎంతకీ ముందుకు సాగడం లేదు. మరోవైపు ఈ ఖాళీ సమయంలో ఆరెక్స్ 100కి సీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నానన్న అజయ్ భూపతి చనిపోయిన శివ పాత్రకు కొనసాగింపు ఎలా చేస్తాడో. ఇదలా ఉంచితే మహా సముద్రంకు మాత్రం మహా మహా కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకే అధికారిక ప్రకటనలోనూ ఆలస్యం జరుగుతోంది. ఈ కథలో కీలకంగా నిలిచే హీరొయిన్ ఎవరో కూడా తేలాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp