Akhanda : బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు

By iDream Post Nov. 09, 2021, 12:30 pm IST
Akhanda : బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు

బాలకృష్ణ బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ రిలీజ్ డేట్ గురించి ఎలాంటి ప్రకటన రావడం లేదు. టైటిల్ సాంగ్ తో సహా ఇప్పటిదాకా రెండు లిరికల్ వీడియోలు ఒక టీజర్ వచ్చాయి. అంతకు మించి ఇంకే ప్రమోషనల్ మెటీరియల్ మొదలు పెట్టలేదు. విడుదల ఎప్పుడు ఉంటుందన్న అభిమానుల ఆతృతకు బ్రేకులు పడటం లేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఏపిలో టికెట్ రేట్లకు సంబంధించి ఇంకా వ్యవహారం సెటిల్ కాకపోవడంతో అక్కడి బయ్యర్లు సుమారు 7 కోట్ల తక్కువగా తిరిగి కోట్ చేస్తున్నారట. అంటే ముందు చేసుకున్న 35కు బదులు 28 ఇస్తామని చెబుతున్నారట. ఇది పెద్ద వ్యత్యాసమే.

నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఈ కారణంగానే డేట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలిసింది. బడ్జెట్ కూడా ఆల్రెడీ తడిసి మోపెడయ్యింది. కరోనా వాయిదా వల్ల భారం ఇంకా పెరిగింది. బోయపాటి శీను ముందు ఖర్చుని కంట్రోల్ లో పెట్టాలనుకున్నప్పటికీ అది జరగలేదని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు ప్రొడ్యూసర్ రాజీ పడితే తప్ప ఈ వ్యవహారానికి ముగింపు ఉండదు. ఈ సినిమాకే కాదు ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు సైతం ఈ ఫార్ములాని అనుసరించక తప్పలేదు. అలాంటప్పుడు అఖండ మొండికేయడం భావ్యం కాదనేది పంపిణీదారులు వాదన. ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తే తప్ప అనౌన్స్ మెంట్ రాదు.

ఓ అభిమానితో బాలయ్య ఫోన్ లో మాట్లాడిన సందర్భంలో డిసెంబర్ 2 లేదా 17 అఖండ రిలీజ్ అవుతున్నట్టు చెప్పిన ఓ చిన్న వీడియో ట్విట్టర్ లో తిరిగింది. అంటే ఇంకా హీరోకే క్లారిటీ లేదన్న మాట. భారీ అంచనాలు మోస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం, బాలయ్య డ్యూయల్ రోల్, ప్రగ్య జైస్వాల్ గ్లామర్, శ్రీకాంత్ విలనీ లాంటి ప్రత్యేక ఆకర్షణలు చాలా ఉన్నాయి. అఘోరాగా ఎప్పుడూ చేయని పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం ఇందులో చూడొచ్చని అంటున్నారు. సింహా లెజెండ్ తర్వాత కాంబో కాబట్టే హైప్ ఈ రేంజ్ లో ఉంది. ఇవన్నీ కంక్లూజన్ కు వచ్చి త్వరగా ఏదో ఒకటి చెప్పేస్తే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు. లేదంటే ముందు ముందు డేట్లు ఇంకా కష్టమవుతాయి

Also Read : Pakka Commercial : మాస్ రూట్ లోకి కామెడీ దర్శకుడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp