త్రివిక్రం గారు! ఎంత పని చేసారు సార్?

By Satya Cine Feb. 05, 2020, 12:28 pm IST
త్రివిక్రం గారు! ఎంత పని చేసారు సార్?

ఏ మాజీ హీరోయిన్ అయినా తెర మీద కనిపించాలనుకునేటప్పుడు అందంగా కనిపించాలనుకుంటుంది. పాత్ర స్వభావం ఏదైనా మేకప్, కాస్ట్యూం విషయంలో హుందాతనంతో కూడిన అందం తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటుంది.

అత్తారింటికి దారేదిలో నదియాని చూసిన వాళ్లు ఆమెను మళ్లీ మళ్లీ తెర మీద చూడాలనుకున్నారు. ఫలితంగా ఎన్నో సినిమాల్లో ఆమె కనిపించింది. కనిపిస్తూనే ఉంది. కానీ టబు విషయంలో ఎందుకో త్రివిక్రం అంత శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది "అల వైకుంఠపురములో" చూసిన ఎవరికైనా.

పాత్ర స్వాభావ రిత్యా సీరియస్సుగా కనిపించినా మేకప్, కాస్ట్యూం చాలా బ్యాడ్ అనిపించేలా ఉన్నాయి. ఒకప్పుడు టబుని చూసి మనసుపారేసుకున్న నాటి యువతీయువకులు కూడా "పాపం టాబు..ఏజ్ ని ఎవరూ ఆపలేరు" అని నిట్టూరుస్తున్నారు. ఆ ఏజ్ ని కనపడకుండా కపాడేదే మేకప్ అని అందరికీ తెలుసు. ఆ డిపార్ట్మెంట్ విఫలమయింది అనడం కంటే త్రివిక్రం నే బ్లేం చెయ్యాలి ఈ విషయంలో అంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో.

ఆ మాటకొస్తే టబుది పెద్ద వయసేమీ కాదు. మేకప్, కాస్ట్యూముతో చాలా అందంగా చూపించగల పర్సనాలిటీ ఆమెది.

ఇదే సినిమాలో మురళిశర్మకి అన్ని రకాలుగా మంచి స్కోప్ ఇచ్చి పెద్ద వాడిని చేసిన త్రివిక్రం టబుకి మాత్రం అన్యాయం చేసారు. మురళిశర్మకి మరో పది అవకాశాలు కొత్తగా వస్తాయి గానీ టబుకి మాత్రం మరో తల్లిపాత్ర కష్టమే. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp