Movie Collections : కలెక్షన్ల టార్గెట్ 35 కోట్లు దాటితే ఏంటి పరిస్థితి

By iDream Post Oct. 17, 2021, 02:30 pm IST
Movie Collections : కలెక్షన్ల టార్గెట్ 35 కోట్లు దాటితే ఏంటి పరిస్థితి

తెలుగు నేలకు సినిమాలను ఎంత అవినావ సంబంధం ఉందో ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమవుతోంది. ఏప్రిల్ లో కరోనా సెకండ్ వేవ్ పూర్తయ్యాక థియేటర్లు తెరవాలా వద్దా అని ప్రభుత్వాలు ఆందోళన చెందుతుంటే ఏపి తెలంగాణలో మాత్రం ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇతర బాషలకు రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తోందన్న మాట వాస్తవం. దానికి సాక్ష్యంగా వసూళ్లు నిలుస్తున్నాయి. జూలై ఆఖరులో సినిమా హాళ్లు తెరుచుకున్నాక ఎస్ఆర్ కల్యాణ మండపం లాంటి చిన్న సినిమా ఏకంగా 8 కోట్ల షేర్ ని దాటేయడం చిన్న విషయం కాదు. లవ్ స్టోరీ ఇరవై రోజులు దాటి 33 కోట్ల షేర్ ని అందుకున్నాక కూడా సెలవు రోజుల్లో హౌస్ ఫుల్ బోర్డులు వేయిస్తోంది.

టాక్ డివైడ్ వచ్చి బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయిన సీటిమార్ కు వచ్చిన లెక్కలు తక్కువేమి కాదు. బిజినెస్ ఇంకొంచెం తక్కువగా చేసుకుని ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ ముద్ర పడేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. రాజారాజా చోర 6 కోట్లకు పైగా షేర్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచింది. శ్రీదేవి సోడా సెంటర్ ఫ్లాప్ అయినా ఏడు కోట్ల దాకా రాబట్టి నష్టాలను తగ్గించుకుంది. మహానటి, ఎన్టీఆర్ ఫ్లేవర్ లో తీసిన తలైవికి మాత్రం ఘోర తిరస్కారం తప్పలేదు. సిల్లీ కాన్సెప్ట్ తో వచ్చిన గల్లీ రౌడీ ఎంత తక్కువగా అమ్మినా కూడా లాస్ తప్పలేదు. పబ్లిక్ ని తక్కువ అంచనా వేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది మరి.

కాన్సెప్ట్ లో నిజాయితీ ఉన్నా టేకింగ్ లో తడబడిన రిపబ్లిక్, కొండపొలంలు బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోవడం ట్రేడ్ కి షాక్ కలిగించినా కంటెంట్ ని సరిగా ప్రెజెంట్ చేయకపోతే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయని రుజువయ్యింది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదటి వీకెండ్ కే 10 కోట్ల షేర్ ని దాటే దిశగా పరుగులు పెడుతూండటం శుభపరిణామం. పెళ్లి సందడికి సైతం వసూళ్లు వస్తున్నాయి. మహా సముద్రం మాత్రం మునిగిపోయింది. ఈ మొత్తాన్ని విశ్లేషిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో సగటు హిట్ సినిమా షేర్ 35 కోట్ల దాకా వస్తోంది. ఒకవేళ 50 కోట్ల టార్గెట్ తో వచ్చే భారీ సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలియాలంటే ముందు అఖండనో ఖిలాడినో ఏదో ఒకటి వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. మిగిలినవాళ్లకు ధైర్యమూ కలుగుతుంది

Also Read : Rajini's Peddhanna : దీపావళి పండగకు సినిమా టపాసులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp