విశ్వక్ సేన్ కోర్టులో కొత్త రీమేక్

By iDream Post Jul. 10, 2020, 12:03 pm IST
విశ్వక్ సేన్ కోర్టులో కొత్త రీమేక్

చిన్న సినిమాలు వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైందితో పరిచయమైనా ఫలక్ నుమా దాస్ తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ కు ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన హిట్ పేరుకు తగ్గట్టే డీసెంట్ హిట్టు కొట్టి కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇటీవలే దీనికి సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా విశ్వక్ పాగల్ అనే మరో చిత్రం లాక్ డౌన్ మొదలైన కొత్తల్లోనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు. ఇవి కాకుండా కొత్తగా కథలు వినడమే తప్ప ఏ కమిట్ మెంట్ ఇవ్వలేదు. తాజాగా మలయాళంలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న కప్పేల రీమేక్ కు విశ్వక్ సేన్ నే అప్రోచ్ అవుతున్నట్టుగా తెలిసింది. సితారా బ్యానర్ హక్కులు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది కాని అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటిదాకా రాలేదు.

ఒక డిఫరెంట్ సెన్సిబుల్ స్టొరీగా కప్పేల మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిశాయి. ముఖ్యంగా హీరొయిన్ అన్నా బెన్ కు ఏకంగా ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. తెలుగులోనూ సరైన దర్శకుడి చేతిలో పడితే కప్పేల మంచి సినిమానే అవుతుంది. ఇప్పటికే అయ్యప్పనుం కోశియుం రీమేక్ కు రంగం సిద్ధం చేస్తున్న సితార సంస్థ మరోవైపు దీని పనులు కూడా మొదలుపెట్టేసిందట. ఫలక్ నుమా దాస్ కూడా మలయాళం రీమేకే. ఏరికోరి మరీ తనే డైరెక్ట్ చేసుకుని ముచ్చట తీర్చుకున్నాడు విశ్వక్. కాకపోతే గొప్ప ఫలితం దక్కలేదు అంతే. అది మన నేటివిటీకి అంత సింక్ అవ్వని సబ్జెక్టు అవ్వడంతో పాటు కొంత ఓవర్ ది బోర్డ్ బూతు డైలాగులు ఉండటంతో అన్ని వర్గాలకు కనెక్ట్ చేయలేకపోయింది.

కాని కప్పేలలో ఆ రిస్క్ లేదు. కాకపోతే క్యాస్టింగ్ పెద్ద ఛాలెంజ్. అన్నా బెన్ కు ధీటుగా నటించే ఆర్టిస్టుని సెట్ చేసుకోవాలి. తనే చేస్తానంటే మంచిదే కాని లేకపోతే మాత్రం టాస్క్ అంత సులువుగా ఉండకపోవచ్చు. కేరళ సినిమాల మీద మనవాళ్ళు ఈ మధ్య గట్టి కన్నే వేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ దీనికి కనక ఓకే చెబితే మొత్తం మూడు సినిమాలు చేతిలో ఉన్నట్టు అవుతుంది. పాగల్ ని ఈ ఏడాదే రిలీజ్ ప్లాన్ చేశారు కాని లాక్ డౌన్ తర్వాత షూటింగులు ఇంకా మొదలుకాకపోవడంతో ఎప్పటి నుంచి రీ స్టార్ట్ చేస్తారు అనే దాని మీద క్లారిటీ లేదు. సో తన చేతికి వచ్చిన ఈ క్రేజీ రీమేక్ కి విశ్వక్ సేన్ ఓకే చెప్తాడో లేదో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp