మాధవి రూట్లో విజయశాంతి - నో ఛాన్స్

By iDream Post May. 25, 2020, 06:57 pm IST
మాధవి రూట్లో విజయశాంతి - నో ఛాన్స్

నిన్నటి నుంచి కొన్ని మీడియా వర్గాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య తర్వాత రూపొందబోయే లూసిఫర్ రీమేక్ లో లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక పాత్ర చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇప్పట్లో కంటిన్యూ చేసే అవకాశాలు లేవని ఆవిడే స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు చిరు-విజయశాంతిలది బ్లాక్ బస్టర్ జోడి. ఆ అనుబంధంతోనే మహేష్ మూవీ ఫంక్షన్ లో ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పటి టాక్ విషయానికి వస్తే విజయశాంతికి ఆఫర్ చేసింది మలయాళంలో మంజు వారియర్ చేసిన రోల్ అని అందులో పేర్కొన్నారు.

అంటే కథ ప్రకారం సోదరి వరస అన్నమాట. ఇదే రోల్ లో బొమ్మరిల్లు భామ జెనిలియా పేరుని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా కొద్దిరోజుల క్రితమే తెలిసింది. కాని తను ఒప్పుకుందో లేదో ఇంకా తెలియలేదు కాని ఇప్పుడు హటాత్తుగా విజయశాంతి పేరుని తీసుకొచ్చారు. అయితే మాధవికి ఈ టాపిక్ కి సంబంధం ఏమిటి అనే సందేహం వస్తోందా. అక్కడికే వద్దాం. చిరంజీవి కెరీర్ కి మేజర్ మైల్ స్టోన్ గా నిలిచిపోయిన ఖైదిలో హీరో హీరొయిన్ కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా పండిందో గుర్తుందిగా. చిరు-మాధవిలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో జంటగా నటించారు.

ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న మాధవి 1995లో బిగ్ బాస్ లో చిరంజీవి సోదరిగా నటించారు. ఒకప్పుడు ఆడిపాడిన ఈ జంటను అలా చూసేందుకు ప్రేక్షకులకు మనసు రాలేదు. అందులోనూ సినిమా కూడా తేడాగా ఉండటంతో డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు విజయశాంతి అదే పొరపాటు ఎందుకు చేస్తారు. నో వే. అందులోనూ తెరమీద ఇలాంటి రిలేషన్ అంటే అస్సలు బాగోదు. సో ఇదంతా గాసిప్ ప్రచారమే తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మీద తీవ్ర కుస్తీ పడుతున్న దర్శకుడు సుజిత్ చిరంజీవిని మెప్పించేలా రెండు మూడు వెర్షన్లు రెడీ చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల ఆచార్య ఎలాగూ లేట్ అవుతోంది కాబట్టి సుజిత్ కు కాస్త ఎక్కువ టైం దొరికింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp