విజయ్ దేవరకొండ ప్లానింగ్ బాగుందే

By iDream Post Sep. 19, 2021, 12:45 pm IST
విజయ్ దేవరకొండ ప్లానింగ్ బాగుందే

దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అనేది ఎంత పాత సామెత అయినప్పటికీ కాలంతో సంబంధం లేకుండా అది ఎప్పటికైనా వర్తిస్తూనే ఉంటుంది. దానికి సినిమా రంగమే మంచి ఉదాహరణ. పెళ్లి చూపులుతో సక్సెస్ బోణీ కొట్టి అర్జున్ రెడ్డితో యూత్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుని గీత గోవిందంతో స్టార్ లీగ్ లోకి దూసుకుపోయిన విజయ్ దేవరకొండ కూడా ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. ఆ మధ్య రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ చేసిన ఈ వ్యాపారం మొదట్లో మంచి ఊపుగానే సాగింది కానీ ఇప్పుడు కాస్త నెమ్మదించినట్టు టాక్.

ఇదిలా ఉండగానే విజయ్ దేవరకొండ ఇప్పుడు మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో ఎంటరయ్యాడు. ఆసియన్ సంస్థతో కలిసి మహబూబ్ నగర్ లో నిర్మించిన ఏవిడి సినిమాస్ ఈ నెల 24న లవ్ స్టోరీతో గ్రాండ్ లాంచ్ కి రెడీ అవుతోంది. అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ సూపర్ ప్లెక్స్ లను తలదన్నే రీతిలో దీన్ని డిజైన్ చేసినట్టు చూసినవాళ్ల మాట. మొత్తం మూడు స్క్రీన్లతో రూపొందిన ఈ కాంప్లెక్స్ ఇప్పుడా జిల్లాకే ప్రత్యేక ఆకర్షణ కాబోతోందని మీడియా న్యూస్. జిల్లా కేంద్రాల్లో ఈ రేంజ్ లో మల్టీ ప్లెక్సులు కట్టడం తక్కువ. అందులోనూ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం చూస్తే విజయ్ దేవరకొండ ప్లానింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కాకుండా ఇతర హీరోలతో సినిమాలను నిర్మించేందుకు స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు కూడా మరోపక్క జరిగిపోతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు కెరీర్లో ఓ నలభై యాభై సినిమాలు చేశాక వేరే బిజినెస్ ప్లాన్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యూత్ అలా కాదు. చేతిలో నాలుగు డబ్బులు వస్తున్నప్పుడే ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ శాశ్వతం కాదు కాబట్టి దానికి అనుగుణంగా ముందుగానే సిద్ధమవుతున్నారు. ఇది మంచి ఆలోచన. కొందరు రెస్టారెంట్లు మరికొందరు స్పాలు ఇంకొందరు రియల్ ఎస్టేట్ లుఇలా రకరకాల వ్యాపకాల్లో పెట్టుబడులు పెడుతూ సాగుతున్నారు. ముందుచూపు అంటే ఇదే మరి

Also Read: కలర్ఫుల్ గా సాగిన బిగ్ బాస్ 5 హంగామా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp