తల్లికి మరువలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రౌడీ

By iDream Post Sep. 24, 2021, 06:38 pm IST
తల్లికి మరువలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రౌడీ

తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తో ఆయనకు క్రేజ్ వచ్చింది. అందరూ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అనుకుంటారు కానీ అంతకుముందే 78 ఏళ్ల క్రితం నివ్విలా అనే సినిమాతో విజయ్ దేవరకొండ తెరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫుల్ లాంటి సినిమాలో చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు. ఎప్పుడైతే పెళ్లి చూపులు సినిమా హిట్ అయిందో ఆ తర్వాత అర్జున్ రెడ్డి లాంటి ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా కూడా పడింది. దీంతో విజయ్ దేవరకొండ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు వరుసగా ఫ్లాపులు వస్తున్నా సరే విజయ్ దేవరకొండ మార్కెట్ మాత్రం ఏమాత్రం తొణికిస లాడడం లేదు. ఇప్పటికిప్పుడు అనుకోవాలి కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అందరు హీరోలు సినిమాలు చేసుకుంటూనే థియేటర్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సొంత ఊరైన మహబూబ్ నగర్ లో థియేటర్ బిజినెస్ మొదలు పెట్టాడు. మహబూబ్ నగర్ లో ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్ కు ఏవిడి సినిమాస్ అనే పేరు పెట్టారు. ఏషియన్ సినిమాస్ అలాగే విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న ఈ బిజినెస్ ఈ రోజే లవ్ స్టోరీ సినిమాతో ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రోజు శుక్రవారం విజయ్ దేవరకొండ తల్లి మాధవి పుట్టినరోజు కావడంతో ఆ మల్టీ ప్లెక్స్ ప్రారంభించిన విజయ్ ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

పంచుకుంటూ ''హ్యాపీ బర్త్ డే మమ్ములు, ఈ ఏవీడి సినిమాస్ నీకోసం, నీవు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతాను, నీకు మరిన్నీ జ్ఞాపకాలు ఇస్తాను' అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు విజయ్. ఫోటోలో విజయ్ తల్లి మాధవి ఆ థియేటర్ లో నుంచుని నవ్వులు రువ్వుతూ కనిపిస్తున్నారు.. నిజానికి విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడని భావిస్తారు కానీ ఆయన తండ్రి పూరి జగన్నాథ్ అలాగే బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి బ్యాచ్ మేట్ అట. ఆ రోజుల్లో ఆయన నటుడిగా, దర్శకుడిగా అనేక ప్రయత్నాలు చేసి చివరికి టీవీ సీరియల్ రంగంలో స్థిరపడ్డారు అని ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన కుమారుడు ఇంతటి స్టార్ హీరో అవుతాడని ఎవరూ ఊహించలేదు అని టాలెంట్ ఉంటే ఒకరిని తొక్కడం ఎవరి వల్ల కాదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద విజయ్ దేవరకొండ తన తల్లికి ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అపురూపమైనది కదూ.


Also Read : ఇద్దరు యువకుల యుద్ధంలో గెలుపు ఎవరిది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp