బాబాయ్ అబ్బాయికి ఆ కథే ఫిక్సా

By iDream Post May. 26, 2020, 07:33 pm IST
బాబాయ్ అబ్బాయికి ఆ కథే ఫిక్సా

ఎప్పటినుంచో మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్ విక్టరీ వెంకటేష్ రానాల కాంబోలో ఒక చిత్రం. గతంలో ఈ ఇద్దరూ కలిసి నటించనే లేదు. కృష్ణం వందే జగద్గురుంలో ఓ పాటలో వెంకీ జస్ట్ అలా కనిపించి మాయమవుతాడు తప్పించి కలిసి యాక్ట్ చేసిన సీన్స్ ఏమి ఉండవు. అక్కినేని ఫ్యామిలీ తీసుకున్న మనం తరహాలో వెంకటేష్-రానా-నాగ చైతన్య కాంబో ఓ మూవీ రావాలని దగ్గుబాటి కుటుంబం అనుకుంటున్నప్పటికీ సరైన కథ దర్శకుడు దొరకటం లేదు. అందుకే దాన్ని పక్కన బెట్టి ప్రస్తుతానికి వెంకీ-రానాలతో రీమేక్ మల్టీ స్టారర్ కు ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అయ్యప్పనుం కోశియుమ్ ని ఈ కాంబినేషన్ లో తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. రెండు నెలల నుంచే ఈ సినిమా గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకదశలో బాలకృష్ణ పేరు కూడా వినిపించింది కానీ ఆయన అంత ఆసక్తిగా లేరనే టాక్ తర్వాత బయటికొచ్చింది.  సో ఇప్పుడు ఇది కాస్తా సురేష్ బాబు దగ్గరికి వచ్చిందన్న మాట. హక్కులు ఎవరు కొన్నారన్న విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ ముందు నుంచి సూర్యదేవర నాగవంశీ పేరు హై లైట్ అవుతూ వస్తోంది. ఒకవేళ వెంకీ రానాలతో తీయాలనుకున్నా సురేష్ ని పార్ట్ నర్ గా పెట్టుకోవాలి.

నిజంగా కార్యరూపం దాలిస్తే అదేమంత ఇబ్బంది పడేది కాదు కాబట్టి సినిమా పూర్తయ్యాక కమర్షియల్ గా వర్కవుట్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. లాక్ డౌన్ అవ్వగానే వెంకటేష్ నారప్ప బాలన్స్ షూటింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎఫ్3 స్క్రిప్ట్ ని ఫైనల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవి అయ్యాకే పైన సినిమా గురించి వెంకటేష్ ఆలోచించగలరు. ఒకవేళ అనిల్ రావిపూడి ఎఫ్3 ని హోల్డ్ లో పెడితే అప్పుడు దీనికి స్లాట్ దొరుకుంటుంది. మొత్తానికి అధికారిక ప్రకటన రాకుండానే అయ్యప్పనుం కోశియుమ్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. యధాతధంగా తీస్తే ఇబ్బంది కానీ కొన్ని కీలక మార్పులు చేస్తే నిజంగానే దగ్గుబాటి హీరోలకు ఇది మంచి సబ్జెక్టు అవుతుంది. మరి ఏమవుతుందో ఇంకొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp