వరుణ్ తేజ్ 10లో కొత్త స్పెషల్స్

By Ravindra Siraj Feb. 25, 2020, 02:48 pm IST
వరుణ్ తేజ్ 10లో కొత్త స్పెషల్స్

గద్దలకొండ గణేష్ లో ఊర మాస్ విలన్ అవతారంలో మెప్పించిన వరుణ్ తేజ్ తన 10వ సినిమాలో బాక్సర్ గా కొత్త వేషంలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసమే కొంత కాలం విదేశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ ఇప్పుడు దీని షూటింగ్ లో బిజీ ఆయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ వైజాగ్ లో జరుగుతోంది. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ, నాన్న అరవింద్ తో కలిసి మొదటి వెంచర్ గా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

రిలీజ్ డేట్ ని కూడా జూలై 30కి లాక్ చేసినట్టుగా తాజా అప్ డేట్. ఈ తేదీ గతంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం రిజర్వ్ చేసి ఉంచారు. కానీ దాని విడుదల అనూహ్యంగా వచ్చే ఏడాదికి వెళ్లిపోవడంతో ఆ స్లాట్ లో ఫస్ట్ బుకింగ్ చేసుకున్న హీరోగా వరుణ్ తేజ్ లైన్ లోకి వచ్చాడు. ఇంకెవరెవరు పోటీలోకి వస్తారో మున్ముందు తెలుస్తుంది. ఇకపోతే ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. హీరో వరుణ్ తేజ్ కి తండ్రిగా మాధవన్ నటించే అవకాశాలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇతను సబ్జెక్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉంటాడు.

అందులోనూ వేరే భాషలో సినిమాలు ఆచితూచి ఎంచుకుంటున్నాడు,. అయినా కూడా నాగ చైతన్య సవ్యసాచిలో మాధవన్ పాత్ర ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. అయినప్పటికీ ఈ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. తల్లిగా రమ్యకృష్ణ చేసే ఛాన్స్ ఉన్నట్టు వినికిడి. తమన్ సంగీతం మరో ఆకర్షణగా నిలవబోతోంది. తొలిప్రేమ లాంటి మ్యూజికల్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇదే. బడ్జెట్ కూడా భారీగా కేటాయించబోతున్నట్టు తెలిసింది. దేహ ధారుడ్యాన్ని మార్చుకుని మరీ వరుణ్ తేజ్ రెడీ అవుతున్న ఈ సినిమాకు బాక్సర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కానీ వేరే ఆప్షన్స్ కూడా చూస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp