వ‌ర్మ‌కి ముందే తెలుసు

By G.R Maharshi Nov. 29, 2019, 02:00 pm IST
వ‌ర్మ‌కి ముందే తెలుసు

క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు సినిమా విడుద‌ల ఆగిపోతుంద‌ని వ‌ర్మ‌కి ముందే తెలుసు. వ‌ర్మ‌కే కాదు, కాస్తా నాలెడ్జీ ఉన్న‌వాళ్లంద‌రికీ తెలుసు. ఎందుకంటే "వాల్మీకీ " అనే టైటిల్‌కే వివాదం జ‌రిగి, పేరు మార్చిన‌ప్పుడు ఇక రెండు కులాల పేర్ల‌తో ఉన్న సినిమాని సెన్సార్ ఒప్పుకుంటుందా? అందుకే టీవీ ఇంట‌ర్వ్యూల్లో పేరు మారుతుంద‌ని వ‌ర్మ చెప్పాడు. వ‌ర్మ ప్ర‌త్యేక‌త ఏమంటే ప్ర‌తిదీ ఆయ‌న‌కి ప్ర‌చార అస్త్రమే.

తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన కార‌ణంగా కోర్టు సినిమా విడుద‌ల‌ను ఆపింది. వారం రోజుల్లో సినిమాని చూసి అవ‌స‌ర‌మైన మార్పులు చేయాల‌ని సెన్సార్‌బోర్డుని కోర్టు ఆదేశించింది. మార్పులు అంటే అర్థం భారీగా క‌త్తెర ప‌డుతుంద‌నే. వ‌ర్మ త‌ర‌పున న్యాయ‌వాదులు పేరు మార్చుతామ‌ని (అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు), విడుద‌ల‌కి ఆదేశాలు ఇవ్వాల‌ని కోరినా కోర్టు తిర‌స్క‌రించింది.

ఏం జ‌రిగినా వ‌ర్మ ఉద్దేశం మాత్రం నెర‌వేరింది. సినిమా అంద‌రి నోళ్ల‌లో నానింది. సినిమాకి ఎన్ని క‌ట్స్ ప‌డినా రాజ‌కీయ ఆసక్తి ఉన్న‌వాళ్లు ఎలాగూ చూస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp