పవన్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టాలి

By iDream Post Apr. 07, 2021, 11:30 am IST
పవన్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టాలి

ఇంకో 48 గంటల కంటే తక్కువ సమయంలోనే వకీల్ సాబ్ ప్రీమియర్లు ప్రపంచవ్యాప్తంగా మొదలుకాబోతున్నాయి. ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుఝామున షోలు ఉంటాయా లేదా అనే క్లారిటీ ఇంకా రాలేదు. దిల్ రాజు అనుమతుల కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారట. విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం 5 గంటల కన్నా ముందు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఆ మేరకు దిల్ రాజు ముందే క్యూబ్ సంస్థలకు సూచనలు ఇచ్చి అర్ధరాత్రిళ్ళు కీలు పంపవద్దని చెప్పినట్టు వినికిడి. ఇక ఇప్పుడు అందరి చూపు వకీల్ సాబ్ ఓపెనింగ్స్ తో పాటు ఎంత రాబట్టాలి అనేదాని మీదే ఉంది.

ఒక్క థియేట్రికల్ బిజినెస్ నుంచే వకీల్ సాబ్ సుమారు 90 కోట్ల దాకా షేర్ ని వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని ప్రాంతాలకు నిర్మాత చేసుకుంటున్న ఓన్ రిలీజ్ కూడా ఉంది. నైజామ్ అత్యధికంగా 23 కోట్ల దాకా డీల్ జరగ్గా సీడెడ్ 12 కోట్లు, ఉత్తరాంధ్ర 10 కోట్లు, గోదావరి జిల్లాలు 13 కోట్లు, గుంటూరు 8 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు మూడున్నర కోట్లు, కర్ణాటకతో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 4 కోట్లు, ఓవర్సీస్ ని 5 కోట్లతో ఫైనల్ చేసినట్టు సమాచారం. ఓ అయిదు కోట్లు హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇక డిజిటల్ రూపంలో 16 కోట్లు, శాటిలైట్ ద్వారా 15 కోట్లు వచ్చాయి. హిందీ డబ్బింగ్ కూడా డిమాండ్ ఉండటం గమనార్హం.

మొత్తంగా విడుదలకు ముందే దిల్ రాజు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. టికెట్ ధరలు పెంచి అమ్ముతున్నారు కాబట్టి మొదటి రెండు రోజుల్లోనే గ్రాస్ వంద కోట్లు దాటాలని ట్రేడ్ అంచనా వేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి వారం వసూళ్లు చాలా కీలకంగా మారుతున్నాయి. దాంతో పాటు టాక్ చాలా ముఖ్యం. ఎంత పవన్ అయినా కూడా పబ్లిక్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీదే ఫ్యామిలీస్ రావడం ఆధారపడి ఉంటుంది. ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ లాంటి వాళ్ళు వ్యక్తపరిచిన మాటలకు తగ్గట్టు కనక వకీల్ సాబ్ ఉంటే లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖాయమే. చూద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp