'వి'భిన్నంగా సాగిన ఇంద్రమోహనం

By iDream Post Sep. 10, 2020, 07:34 pm IST
'వి'భిన్నంగా సాగిన ఇంద్రమోహనం

టాలీవుడ్ బిగ్గెస్ట్ అండ్ క్రేజీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గా విడుదలైన వి గురించి ఇప్పటికీ ప్రేక్షకుల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా మీద పలు రకాల అభిప్రాయాలు, రివ్యూలు వ్యక్తమవుతున్నప్పటికీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన ఉద్దేశాలు, విలో ఉన్న అంతర్గత సూత్రాల మీద బలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. సాధారణంగా మనం అద్భుతంగా ఉందని వేసుకున్న డ్రెస్సు ఫ్రెండ్స్ కి చాలా మాములుగా అనిపించవచ్చు. అది సహజం. అలాగే ఏదైనా మూవీకి సైతం ఆడియన్స్ రెండు రకాలుగా స్పందించే అవకాశాలూ ఉంటాయి. వి విషయంలో జరిగింది అదే. ఇంద్రగంటికి డైరెక్టర్ గా ఒక బ్రాండ్ ఉంది.

గ్రహణం లాంటి ఆఫ్ బీట్ మూవీతో విమర్శకులను సైతం మెప్పించిన ఈయనే అష్టాచెమ్మాతో థియేటర్లలో విరగబడే నవ్వులు పూయించారు. గోల్కొండ హై స్కూల్ రూపంలో స్ఫూర్తినిచ్చినా, జెంటిల్ మెన్ తో నానిలో కొత్త షేడ్స్ ని బయటికి తీసినా ఈయనకే చెల్లింది. మాయాబజార్ లాంటి క్లాసిక్ టైటిల్ తో ఫాంటసీ ప్రయోగం చేయడం ఫలితంతో సంబంధం లేకుండా టాక్ గా మారింది. ఇక సుధీర్ బాబుతో గత ఏడాది చేసిన సమ్మోహనం పేరుకు తగ్గట్టే చూసినవాళ్లుకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. సహజంగానే ఇవన్నీ వి మీద ప్రభావం చూపించాయి. కథకు అనుగుణంగా నానితో వయొలెన్స్ చేయించడం, హత్యలను కొత్త తరహాలో ప్రెజెంట్ చేయడం విభిన్నంగా ఉన్నప్పటికీ ఇంద్రగంటి నుంచి ఆశించింది ఇది కాదే అన్న ఫీలింగ్ ని కలిగించాయి.

సుధీర్ బాబుతో రెండో సినిమా, నానితో మూడో మూవీగా ఇంద్రగంటి చాలా కంఫర్ట్ గా ఫ్రీడమ్ తీసుకోవడం వల్ల ఎక్కడా రాజీ పడిన సందర్బం ఉండదు. అయితే వి తాలూకు అనుభవాలు, కథను చెప్పే క్రమంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఎంచుకున్న ఫార్మాట్ ఇవన్నీ ఖచ్చితంగా కొత్తగా అనిపించేవే. థియేటర్లో కాకుండా నేరుగా ఇంటికే సినిమా రావడం వల్ల కొంత ఎఫెక్ట్ పడిందన్న వాళ్ళు లేకపోలేదు. ఇంకా లోతుగా దీని గురించి స్వయంగా ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పడం ద్వారా తెలుసుకుంటేనే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సాహెబా అనే పాత్ర చుట్టూ అల్లుకున్న క్రైమ్ డ్రామాగా వి రూపాంతరం చెందటంలో ఇంద్రగంటి చేసిన కథా ప్రయాణం ఆయన మాటల్లోనే తెలుసుకోవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp