కృతి శెట్టి డిమాండ్ మాములుగా లేదు

By iDream Post Jul. 26, 2021, 05:05 pm IST
కృతి శెట్టి డిమాండ్ మాములుగా లేదు

చేసింది ఒకటే సినిమా. ఉప్పెన ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కట్ చేస్తే రామ్, నాని, సుధీర్ బాబు లాంటి మీడియం రేంజ్ స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కృతి శెట్టి డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే ఒక టీవీ సీరియల్ ప్రోమోలో నటించేందుకు సైతం ఏకంగా కోటి రూపాయలు పారితోషికం తీసుకునేంత. ఈ మాట సదరు ఛానల్ కానీ ఆ అమ్మాయి చెప్పలేదు కానీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం ఈ టాక్ జోరుగా ఉంది. త్వరలో ప్రారంభం కానున్న ఒక భారీ బడ్జెట్ సీరియల్ కోసం నిర్మాతలు కేవలం యాడ్స్ లో నటించేందుకే ఇంత మొత్తం ముట్టజెప్పారంటే పాపులారిటీ ఏ స్థాయికి పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీనే అంత. ఓవర్ నైట్ సక్సెస్ నిన్నటి దాకా అనామకులుగా ఉన్నవాళ్లను ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. చిరంజీవి ఖైదీ, నాగార్జున శివ, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, రవితేజ ఇడియట్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కృతి శెట్టిని ఏకంగా వీళ్ళతో పోల్చడం సాహసమే కానీ విజయ లక్ష్మి పలకరించాలే కానీ నిర్మాతలు ఏ స్థాయిలో వెంటబడతారో చెప్పేందుకు ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. నిజానికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. హీరో వైష్ణవ్ తేజ్ దాని కన్నా ముందు పూర్తి చేసిన ప్రాజెక్ట్ తప్ప ఇంకో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఇంకొన్ని చర్చల దశలోనే ఉన్నాయి.

ఇటుపక్క చూస్తే కృతి శెట్టి రేంజ్ అమాంతం పెరిగిపోతోంది. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. అంటే క్లాసు మాసు కనెక్ట్ అయిన భామలు దొరకడం కష్టంగా ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్న లను స్టార్ హీరోలు వదిలి పెట్టడం లేదు. ఉన్న మెహ్రీన్ లాంటి వాళ్ళు సంతోష్ శోభన్ లాంటి చిన్న హీరోలతో జట్టు కట్టేస్తున్నారు. ఇక తమన్నా, కాజల్ అగర్వాల్ లు బాగా సీనియర్లు అయిపోయారు. బ్లాక్ బస్టర్లే తక్కువగా వస్తున్నప్పుడు స్టార్ హీరోయిన్లు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తారు. ఏమైనా కృతి శెట్టి సుడి మాములుగా లేదు. ఆ మధ్య రెండు మూడు పెద్ద ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసిందట. తన రేంజ్ కు తగ్గట్టుగా లేవట

Also Read: తమన్నా పాట కోసం ఇంత ఖర్చా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp