బన్నీ సినిమాకు బుచ్చిబాబు ఎలివేషన్

By iDream Post Jun. 14, 2021, 01:00 pm IST
బన్నీ సినిమాకు బుచ్చిబాబు ఎలివేషన్
అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మీద ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని లాక్ డౌన్ కాగానే వీలైనంత వేగంగా పూర్తి చేసి రెండో భాగం మీద ఫోకస్ పెట్టేందుకు దర్శకుడు సుకుమార్ సిద్ధమవుతున్నారు. ఎలాగూ రెండు భాగాల మధ్య ఇంకో సినిమా వస్తుందని మొన్న బన్నీ వాస్ చెప్పాడు కాబట్టి సీక్వెల్ కి చాలా టైం దొరుకుతుంది. ఉప్పెన దర్శకుడు సుకుమార్ ప్రియ శిష్యుడు తాజాగా ఇచ్చిన ఎలివేషన్లు వింటే అభిమానుల ఊహలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయో ఊహించడం కష్టమే.

ఇటీవలే సోషల్ మీడియాలో క్లబ్ హౌస్ అనే యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా సరే ఇందులో గ్రూప్స్ గా మారి ఒకరికొకరు కనిపించకుండా కాన్ఫరెన్స్ కాల్ తరహాలో మాట్లాడుకోవచ్చు. పాల్గొన్న వాళ్ళ ఫోటోలు తప్ప ఇతర వివరాలు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఎవరికీ కనిపించవు. దీనికి ఆదరణ బాగానే దక్కుతోంది. నిన్న రాత్రి ఇండస్ట్రీలో కొందరు దర్శకులు నిర్మాతలు మీడియా ప్రతినిధులు మిస్సింగ్ తెలుగు సినిమా అనే టాపిక్ మీద ఈ ఆడియో డిస్కషన్ లో పాల్గొన్నారు. అందులో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా తన సినిమా విడుదలకు ముందు అనుభవాలు, పుష్ప తాలూకు విశేషాలు పంచుకున్నారు.

పుష్పలో 10 కెజిఎఫ్ ల రేంజ్ లో ఎలివేషన్లు ఉంటాయని ఒళ్ళంతా బురద పూసుకుని అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ గత కొంత కాలం ఎవరూ చేయలేదనే స్థాయిలో వచ్చిందని  చెప్పి ఊరించాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కూడా అద్భుతంగా కుదిరాయని., ఇప్పటికిప్పుడు పాడాలని అనిపిస్తోందని ఒకటే టెంప్ట్ చేశాడు. సరే గురువు మీద అభిమానంతో బుచ్చిబాబు ఇదంతా చెప్పాడు అనుకున్నా ఎంతో కొంత నిజమైతే ఉండకపోదు. ఆ రేంజ్ అవుట్ ఫుట్ వస్తోంది కాబట్టే ఉన్నట్టుంది రెండు భాగాలకు ఫిక్స్ అయ్యారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్పలో ఫహద్ ఫాసిల్ విలనీ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp